English   

రాజ్ తరుణ్ స్పెషల్ వీడియో.. యాక్సిడెంట్‌పై క్లారిటీ ఇచ్చిన హీరో.. 

Raj Tarun
2019-08-21 18:16:19

రాజ్ తరుణ్ కు ఇన్ని రోజుల నుంచి రాని గుర్తింపు ఒక్క యాక్సిడెంట్ తోనే వచ్చేసినట్లుంది. అక్కడయింది చిన్న యాక్సిడెంట్ అయినా కూడా ఎందుకో తెలియదు కానీ మీడియా మాత్రం దాన్ని బూతద్దంలో పెట్టి చూపించింది. యాక్సిడెంట్ అయిన వెంటనే రాజ్ తరుణ్ అక్కడ్నుంచి పారిపోవడం అనేది మీడియా కంటికి పెద్దగా కనిపించింది. కానీ మనోడు మాత్రం ప్రమాదం జరిగిన తర్వాత తనకేం అర్థం కాక అక్కడెవరైనా ఉంటే సాయం కోసం అడుగుదామని పరిగెత్తాను.. కానీ పారిపోయానంటున్నారు అంటూ అమాయాకంగా చెబుతున్నాడు. హైదరాబాద్ అలకాపురి జంక్షన్ దగ్గర కొన్ని గంటల కింద రాజ్ తరుణ్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. అది జరిగిన తర్వాత కొన్ని గంటల పాటు రాజ్ తరుణ్ ఎవరికీ కనిపించలేదు. ఎందుకో అంటూ మీడియాలో చాలా కథనాలే వచ్చాయి. ఇప్పుడు వీటిపై స్పందిస్తూ రాజ్ తరుణ్ ఓ వీడియో విడుదల చేసాడు. ఇందులో తన యాక్సిడెంట్‌ విషయాలను చెప్పుకొచ్చాడు రాజ్. తాగి డ్రైవ్ చేస్తున్నానని మీడియాలో వచ్చిందని.. కానీ అప్పుడు తాను మద్యం సేవించలేదని చెప్పాడు ఈ హీరో. ఆ సమయంలో తనతో పాటు కారులో ఇంకెవరు లేరని.. ఒక్కన్నే వస్తున్నానని చెప్పాడు. యాక్సిడెంట్‌ జరిగిన సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకున్నాను కాబట్టి సరిపోయింది కానీ లేదంటే పరిస్థితి మరోలా ఉండేదంటున్నాడు ఈయన. అంతేకాదు కార్ డ్రైవ్ చేసేవాళ్లంతా కచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలంటూ చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్. బైక్ నడిపే వాళ్లు హెల్మెట్ కూడా పెట్టుకోవాలని.. జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నాడు. ఇక యాక్సిడెంట్ అయిన తర్వాత తానెక్కడికి పారిపోలేదని.. తన ఇంట్లోనే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చాడు రాజ్ తరుణ్. మరి ఈయన సమాధానంతో మీడియా శాంతిస్తుందో లేదో చూడాలి.
 

More Related Stories