English   

వరుణ్ తేజ్, నిహారిక స్కై వాక్.. మెగా వారసుల సాహస క్రీడలు..

niharika
2019-08-21 18:23:05

వాల్మీకి సినిమాతో కొన్ని రోజులుగా ఫుల్ బిజీగా ఉన్న వరుణ్ తేజ్.. ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నాడు. ఈయన తాజాగా తన సోదరి నిహారికతో కలిసి మకావ్ ట్రిప్ లో ఉన్నాడు. వాల్మీకి షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. దాంతో ఇప్పుడు ఫారెన్ టూర్ వెళ్లాడు వరుణ్. ఆయనతో పాటు చెల్లి నిహారిక కూడా ఉంది. ఈ ఇద్దరూ కలిసి స్కై వాక్ చేయడానికి ఫిక్సైపోయారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్కై వాక్ వీడియో చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ దాన్ని చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు మెగా వారసులు. వరుణ్ తేజ్ అంటే ఓకే కానీ నిహారిక కూడా స్కై వాక్ చేయడం నిజంగానే సంచలనం. సినిమాల్లో హీరోలు సాహసాలు చేయడం రొటీన్ కానీ బయట కూడా ఇలా చేయడం అనేది నిజంగానే గొప్ప విషయం. వరుణ్ తేజ్ చాలా ధైర్యంగా కనిపిస్తున్నా కూడా నిహారిక కాస్త పడుతుంది. ఎంతైనా ఆడపిల్ల కదా.. ఆ మాత్రం భయం ఉండటం తప్పేం కాదు. మొత్తానికి వరుణ్, నిహారిక చేసిన ఈ సాహసం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.

More Related Stories