English   

వాల్మీకి జర్ర జర్ర సాంగ్.. పక్కా మాస్ పాటతో వచ్చిన వరుణ్ తేజ్..

valmiki
2019-08-21 18:38:04

డిజే వచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటి వరకు మరో సినిమా విడుదల చేయలేదు హరీష్ శంకర్. ఈ సినిమా బాగానే ఆడినా కూడా ఎందుకో కానీ హరీష్ కు అనుకున్న అవకాశాలు మాత్రం రాలేదు. ఇక ఇప్పుడు ఇదే కసితో ఇప్పుడు వరుణ్ తేజ్ హీరోగా వాల్మీకి సినిమా తెరకెక్కిస్తున్నాడు హరీష్. ఇందులోంచి ఒక్కో పోస్టర్.. టీజర్ విడుదలవుతుంటే సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా జర్ర జర్ర అంటూ సాగే పాట విడుదల చేసారు దర్శక నిర్మాతలు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడు విడుదలైన పాట పక్కా తెలంగాణ యాసలో సాగుతుంది. దీనికి భాస్కరబట్ల సాహిత్యం అందించగా.. అనురాగ్ కులకర్ణి, ఉమా నేహా పాడారు. జర్ర జర్ర అచ్చా.. జర్ర జర్ర కచ్చా.. నేనింతే చిచ్చ.. చంద్రుడికైనా లేదా మచ్చ అంటూ ఈ పాట సాగుతుంది. లోపల కూడా బద్దలే బాసింగాలు.. చేస్తే నకరాలు అంటూ తెలంగాణ పదాలను వాడేసాడు భాస్కరబట్ల. ఈ సినిమాలో వరుణ్ పాత్ర కూడా తెలంగాణలోనే మాట్లాడుతుంది. ఈ పాటలో వరుణ్ తేజ్ తో పాటు అథర్వా మురళి, డింపుల్ హయతి కూడా ఉన్నారు. మయాంక బోస్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. సెప్టెంబర్ 13న విడుదల కానుంది వాల్మీకి.

 

More Related Stories