English   

వరుణ్ సందేశ్‌పై అసలు ఇష్టమే ఉండేది కాదు.. వితికా సంచలనం..

varun
2019-08-21 19:07:11

వితికా షెరూ.. ఇదివరకు అయితే ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయ కార్యక్రమాలు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అవసరం లేదు. దానికి కారణం బిగ్ బాస్ తెలుగు సీజన్ 3. ఈ సారి ఏకంగా భర్త వరుణ్ సందేశ్ తో కలిసి వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ ఈ ఇద్దరి రొమాన్స్ చూసి అంతా ఔరా అనుకుంటున్నారు. ఇప్పటికే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నా కూడా కావాలనే వితికాను ఇంకా ఇంట్లో ఉంచారు నిర్వాహకులు. ఎప్పటికప్పుడు తన భర్త గురించి ఆసక్తికరమైన విషయాలు చెబుతూ కెమెరా కంట పడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు కూడా ఇదే చేసింది. అసలు తనకు వరుణ్ ఎలా పరిచయం అయ్యాడు నుంచి మొదలుపెట్టి ఎలా పెళ్లి చేసుకున్నాం వరకు అంతా చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. పర్సనల్ విషయాలు కూడా చాలా ఓపెన్ గా డిస్కస్ చేసింది వితికా షెరూ. ఈ ఇద్దరూ కలిసి అప్పట్లో పడ్డానండీ ప్రేమలో మరి సినిమాలో నటించారు. ఈ సినిమా తర్వాత నిజంగానే ప్రేమలో పడిపోయి పెళ్లి కూడా చేసుకున్నారు. ఇదిలా ఉంటే అసలు మొదట్లో తనకు వరుణ్‌పై ఏ మాత్రం మంచి అభిప్రాయం లేదని చెప్పింది ఈ బ్యూటీ. ఈయనతో సినిమా కూడా చేయకూడదని ముందే అనుకున్నానని.. అయితే కథ నచ్చి చేసానని చెప్పింది వితికా. ఎక్కువగా అమ్మాయిలతో మాట్లాడతాడని ఫ్రెండ్స్ చెప్పడంతో దూరం పెట్టానని చెప్పింది ఈమె. తమ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత కూడా అసలు ఏ రోజు మాట్లాడింది లేదని.. మూడు నెలల తర్వాత ఓ రోజు క్లైమాక్స్ సీన్ లో కార్ లో వెళ్తున్నపుడు మాట్లాడాడని చెప్పింది వితికా షెరూ. అప్పుడే తాను అమెరికా వెళ్లి రావడంతో ఏమేం చూసావంటూ వరుణ్ మాట్లాడినట్లు చెప్పింది వితికా. తను ఎన్నారై కావడంతో అన్నీ కనుక్కున్నాడని.. అక్కడ్నుంచి స్నేహం పెరిగిందని చెప్పుకొచ్చింది. షూటింగ్ తర్వాత ఇంట్లో ఒక్కడే ఉండేవాడని.. ఏం తింటాడో.. ఎలా ఉంటాడో అనే కంగారు తనకు కూడా ఉండేదని చెప్పింది. ప్రేమ కంటే ముందు జాలి వేసిందని చెప్పింది ఈమె. మొత్తానికి అలా తన ప్రేమకథ మొదలైందని చెప్పుకొచ్చింది వితికా షెరూ.

More Related Stories