English   

చిరంజీవి బర్త్ డే వేడుకలు...ఒక రోజు ముందుగానే

chiranjeevi
2019-08-21 20:25:14

చిరంజీవి పుట్టినరోజు మెగా అభిమానులకు పండుగ రోజు అని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రతీ ఏటా ఆయన బర్త్ డేని చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆయన పుట్టినరోజుని ఎంతో స్పెషల్‌గా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ మెగా ఫ్యాన్స్ అనిపించుకుంటూ ఉంటారు. రేపు ఆయన పుట్టినరోజు నేపథ్యంలోనే పుట్టినరోజు వేడుకలు ఒకరోజు ముందుగా ఈరోజే ప్లాన్ చేశారు ఆయన అభిమానులు. ఏకంగా ఆయన 64వ పుట్టిన రోజు సందర్బంగా ఈరోజు భారీ వేడుక ప్లాన్ చేశారు. ఈ వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరుగుతోంది. కేవలం మెగా అభిమానులు మాత్రమే ప్రత్యేకంగా జరుపుకునే ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.
ఇప్పటికే శిల్పకళావేదిక వద్దకు చాలా మంది ఫ్యాన్స్ చేరుకున్నారు. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. ఇక ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ఒక లేఖ విడుదల చేశారు. నాకు స్ఫూర్తిప్రదాత చిరంజీవి గారి జన్మదినం.. అభిమానులందరికీ పండుగ రోజని ఆ లేఖలో పవన్ పేర్కొన్నారు. చిరంజీవి అంటే కేవలం మెగాస్టార్‌ మాత్రమే కాదు, మూర్తీభవించిన స్ఫూర్తి అని అన్నయ్యపై ప్రశంసలు గుప్పించారు. అబ్దుల్‌ కలాం చెప్పినట్లుగా 'పెద్ద కలలు కనడం, ఆ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడటం' అనే జీవన వేదానికి చిరంజీవి ప్రస్థానం నిదర్శనమని పవన్ వ్యాఖ్యానించారు.

More Related Stories