English   

ప్రభాస్ సాహో ఫస్ట్ రివ్యూ.. సెన్సార్ టాక్ ఎలా ఉందంటే..?

saaho
2019-08-22 16:03:43

ప్రభాస్ సాహో కోసం అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ చిత్రంతో కచ్చితంగా ఇండియన్ సినిమా రికార్డులతో మరోసారి ప్రభాస్ ఆడుకుంటాడని నమ్ముతున్నారు అభిమానులు. కచ్చితంగా సాహో ఓపెనింగ్స్ లో అద్భుతాలు చేస్తుందని వాళ్ళు చెబుతున్నారు. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తికి తెరదించుతూ ఇప్పుడు ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. వారం రోజుల ముందే సాహో సెన్సార్ పూర్తి చేసుకుంది. దీనికి యు బై ఎ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ తో పాటు హీరోయిన్ల అందాల ఆరబోత కూడా భారీగానే ఉండటంతో యు కు తోడుగా ఏ కూడా ఇచ్చింది బోర్డ్. ఈ సినిమా 174 నిమిషాలతో వస్తుంది. అంటే దాదాపు మూడు గంటల సినిమా అన్నమాట. అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా ఈ చిత్రాన్ని అద్భుతమైన యాక్షన్ ఫీస్ట్ గా సుజీత్ తెరకెక్కించాడని తెలుస్తుంది. సినిమా చూసిన తర్వాత సెన్సార్ సభ్యులు కూడా ఫిదా అయిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. రన్ టైమ్ కాస్త ఎక్కువగా అనిపించినా కూడా ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్స్ కు ఆ మాత్రం ఉన్నా కూడా పర్లేదంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ రన్ టైంలో మూడు నిమిషాల పాటు ప్రకటనలు కూడా ఉంటాయి. అంటే సినిమా రన్ టైమ్ 2 గంటల 54 నిమిషాలు అన్నమాట. సినిమా చూసిన తర్వాత సెన్సార్ సభ్యులు లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టారని తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై చూడనటువంటి యాక్షన్ సీన్స్ ఇందులో సుజీత్ తెరకెక్కించాడని ప్రచారం జరుగుతుంది. మైండ్ బ్లోయింగ్ అనే మాట తప్ప మరో మాటే అక్కడ వినిపించడం లేదు. రేపు ఆగస్ట్ 30న విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుంచి కూడా ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని వాళ్లు ఊహిస్తున్నారు. ఈ సినిమాలో జాకీష్రాఫ్, మందిరాబేడి, నీల్ నితిన్ ముఖేష్, చంకీ పాండే, అరుణ్ విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మొత్తానికి చూడాలిక.. సెన్సార్ రివ్యూతో బయటి రివ్యూ ఎంతవరకు మ్యాచ్ అవుతుందో..?

More Related Stories