English   

విజయ్ దేవరకొండతో పూరీ జగన్నాథ్ ఫైటర్..

puri
2019-08-22 16:27:40

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి జ‌గ‌న్నాథ్‌ మళ్లీ బిజీ అయిపోయాడు. ఆ సినిమా విడుదలై నెల రోజులు కూడా గడవక ముందే విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాను కన్ఫర్మ్ చేసుకున్నాడు ఈ దర్శకుడు. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి టైటిల్ ఖ‌రారు చేసారు. దీనికి ఫైటర్ అనే టైటిల్ పక్కాగా సరిపోతుందని చెబుతున్నాడు ఈ డాషింగ్ డైరెక్టర్. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే డియర్ కామ్రేడ్ ఫ్లాప్ కావడంతో ఈ చిత్రంపై నమ్మకం భారీగానే పెట్టుకున్నాడు పూరీ. ఈ కాంబినేషన్‌లో త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం లొకేషన్స్ వేటలో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఈ చిత్రానికి `ఫైట‌ర్‌` అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ అయితే కథకు సరిపోతుందంటున్నాడు పూరీ. కచ్చితంగా ఈ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర మాయ చేస్తామంటున్నాడు ఈ దర్శకుడు. ఈ మధ్యే వచ్చిన `ఇస్మార్ట్ శంకర్`తో చాలా ఏళ్ళ తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టాడు పూరీ. ఈ సమయంలో విజయ్ దేవరకొండతో సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాను కూడా పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, చార్మి నిర్మిస్తున్నారు.  ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌న్నింటినీ పూర్తి చేసుకుని జ‌న‌వ‌రి నుండి ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు ఈ దర్శకుడు. ఇందులో విజయ్ కొత్త కోణంలో కనిపించబోతున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది.

More Related Stories