English   

సమంతా వీడియో చూశారా....వామ్మో !

Samantha
2019-08-23 11:00:23

తెలుగులోనే కాక దక్షిణాది బాషలు అన్నిటిలో టాప్ రేసులో దూసుకుపోతున్న హీరోయిన్లలో సమంత ఒకరు. అక్కినేని కోడలు అయ్యాక కాస్త గ్లామరస్ పాత్రలు ఆపేసిన ఆమె లేడీ ఓరియెంటెడ్ మూవీలపై దృష్టి పెట్టి నాయికా ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తోంది. తాజాగా ఓ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె ప్రస్తుతం శర్వానంద్‌తో కలిసి తమిళ ‘96’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. ఆమె ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారనే టాక్ మొదలయ్యింది. ఆమె అయితే కన్ఫాం చేయలేదు కానీ ఎందుకో ఈ ప్రచారం మాత్రం ఎక్కడా ఆగలేదు. తాజాగా సమంత తన ఫిట్‌నెస్ వీడియో ఒకదానిని సోషల్ మీడియా లో షేర్ చేశారు. 

ఆమె షేర్ చేసిన వీడియోను చూస్తే ఆమె అభిమానులే కాదు ఎవరైనా షాక్ కావాల్సిందే. ప్రొఫెషనల్ అథ్లెట్ లానే మెటల్ బార్స్‌ను రెండు చేతులతో పట్టుకొని  పైకి పాకేస్తు షాక్ ఇచ్చింది. ఫిట్‌నెస్ ట్రైనర్ అభినవ్ ఆధ్వర్యంలో సమంత ఈ ఫీట్లు చేసింది. ఆమె అదొక్కటే కాదు రెండు రోజుల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో కూడా కొన్ని వీడియోలు పెట్టారు. అవి కూడా ఫిట్‌నెస్‌ కు సంబంధించినవే. అయితే ఆమె ప్రవర్తన పట్ల నాగార్జున కోపంగా ఉన్నారని అందుకే ఆమె సోషల్ మీడియాలో సైలెంట్ అయ్యారని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఆమె పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

More Related Stories