English   

చిరు విషయంలో నాగబాబు అసంతృప్తి !

Nagababu
2019-08-23 12:05:49

అన్న మెగా స్టార్ విషయంలో తనకి ఒక అసంతృప్తి ఉందంటున్నారు ఆయన సోదరుడు నటుడు నాగబాబు. నిజానికి ఎన్టీఆర్ శకం తర్వాత తెలుగులో అంత పేరు తెచ్చుకున్న నటుడు మెగాస్టార్ మాత్రమే, ఆయన సినిమాలు ఆపేసి రాజకీయాల్లోకి వెళ్ళినా ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయారు. రాజకీయాలు కలసి రాకో లేక సినిమాలంటే పిచ్చో తెలీదు కానీ ఆయన మళ్ళీ సినిమాలనే చేసుకుంటున్నారు. అయితే అంత క్రేజ్ ఉన్నా ఆయనకి ఇప్పటిదాకా జాతీయ ఉత్తమ నటుడిగా ఒక్క అవార్డ్ కూడా లేదు, ఈ విషయంలో తెలుగులో చాలామంది సినీ అభిమానులు ఫీల్ అవుతూ ఉంటారు. తాజాగా అదే విషయాన్ని నాగబాబు చెప్పుకొచ్చారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలు చేసిన చిరంజీవికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రాలేదన్న అసంతృప్తి ఇప్పటికీ ఉందని నాగబాబు చెప్పుకొచ్చారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా మీడియా తో ముచ్చటించిన నాగబాబు తన మనసులో ఉన్న ఈ ఆవేదనను వ్యక్తం చేసారు. అన్నయ్యలాంటి స్టార్‌కి ఒక్కసారి కూడా ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డు రాలేదేనని బాధపడుతుంటానని నాగబాబు చెప్పుకొచ్చారు. రుద్రవీణ సినిమాకే ఈ అవార్డు రావాల్సింది కానీ, ఎందుకో ఇవ్వలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈసారి అయినా సైరాతో ఆ కోరిక తీరుతుందని అనుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు.  
 

More Related Stories