English   

సాహోలో చరణ్, అనుష్కలు పెట్టుబడి

Ram charan
2019-08-23 14:18:25

టాలీవుడ్ నుంచి ఈ ఏడాది వస్తోన్న అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు ‘సాహో’, ‘సైరా నరసింహారెడ్డి’. ఒకరకంగా అమితాబ్ లాంటి స్టార్ హీరో నటించినా సరే సైరా కన్నా సాహో సినిమాకు జాతీయ స్థాయిలో విపరీతమైన బజ్ ఉంది. సాహో కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సైరా బజ్ సాహోతో పోల్చితే తక్కువే కానీ అలా అయితే మిగతా తక్కువేమీ కాదు. ఈ సినిమాను హిందీలో ప్రముఖ నటుడు ఫర్హాన్ అక్తర్ విడుదల చేస్తున్నారు. మెగాస్టార్ క్రేజ్ వలన ఈ సినిమా మీద తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ అంచనాలున్నాయి. ఇలాంటి సమయంలో సైరా సినిమాని నిర్మించిన చరణ్ గురించిన ఒక వార్త సంచలనంగా మారింది. అదేంటంటే బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో సాహో సినిమా మీద భారీ  అంచనాలు ఉన్నాయి. 

అందుకే ఈ సినిమా మీద ప్రభాస్‌తో పాటుగా నిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కమర్షియల్‌ ఫార్మెట్‌లో ఎంతో పెట్టుబడి పెట్టి మరీ ఈ సినిమా తీశారు. ఇండియాలో ఐదు భాషలతో పాటుగా విదేశాల్లో కూడా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ప్రభాస్‌కు ఉన్న మార్కెట్‌ దృష్ట్యా బడ్జెట్‌ విషయంలో రాజీ పడలేదు. ఈ సినిమా పెట్టుబడి రెండువందల యాభై కోట్ల నుండి మూడు వందల కోట్ల దాకా పెట్టినట్టు ప్రచారం జరగగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఇప్పటికే 330 కోట్లు జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా కోసం పెట్టుబడి పెట్టె సమయంలో ఎంత ప్రభాస్ సన్నిహితులు అయినా నిర్మాతలు ఒత్తిడి ఎదుర్కొన్నారని ఆ సమయంలో చరణ్ తో పాటు అనుష్క కూడా డబ్బు పరంగా సపోర్ట్‌ చేశారని అంటున్నారు. అందుకే వీరిద్దరికీ ఈ సినిమా లాభాల్లో వాటా ఇవ్వాలని మేకర్స్ ఫిక్స్ అయినట్టు చెబుతున్నారు. ఇక ఇందులో నిజమెంతనేది తెలియన్పపటికీ, సాహో కోసం మాత్రం జనం ఏంటో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
 

More Related Stories