English   

యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్ లు...రాజ్ తరుణ్ కి బ్లాక్ మెయిల్

Raj Tarun
2019-08-23 14:32:30

హీరో రాజ్‌ తరుణ్ కారు ప్రమాదం కేసులో కొత్త కొత్త ట్విస్ట్‌ లు బయట పడుతున్నాయి. కారు ప్రమాదం జరిగిన సమయంలో అప్పటి దృశ్యాలను అక్కడి స్థానికుడు, సినిమా ఇండస్ట్రీకి చెందిన కాస్ట్యూమ్ డిజైనర్ కార్తీక్‌ తన సెల్‌ ఫోన్‌ లో వీడియో తీశాడు. ఆ సమయంలో కారు దిగి పరుగులు పెడుతున్న రాజ్‌ తరుణ్‌ ను వెంటాడి పట్టుకుని మరీ కొన్ని వీడియోలు తీశారు. ఆ వీడియోలలో తాను మద్యం సేవించినట్టు, వదిలిపెట్టమని కోరినట్టు ఉంది. అయితే ఆ వీడియోలు ఇవ్వమని కార్తీక్‌ కు బెదిరింపులు ఎదురవుతున్నాయని, రాజ్‌ తరుణ్‌ మేనేజర్‌ నటుడు రాజా రవీంద్ర తనను ఫోన్‌ లో బెదిరిస్తున్నాడంటూ కార్తీక్ మీడియా మందుకు వచ్చారు. తనకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని కూడా ప్రలోభపెట్టినట్లు తెలిపాడు. అయితే కార్తీక్ చెప్పేదంతా అబద్దమని వీడియో అడ్డంపెట్టుకుని తమని రూ.5లక్షలు డిమాండ్ చేశాడని మీడియా ముందుకు వచ్చారు రాజా రవీంద్ర. రాజ్ తరుణ్ వీడియోలతో కార్తీక్ తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నిన్న మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో తాను ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఐదు లక్షలు ఇస్తే వీడియోలు తీసేస్తానని కార్తికే డిమాండ్ చేశాడని చెప్పుకొచ్చారు రాజా రవీంద్ర. రాజ్ తరుణ్ కెరియర్ పోతుందని మూడు లక్షలు అయినా ఇవ్వమని కార్తీక్ అడిగారని ఆయన తెలిపాడు. అడిగినంత డబ్బులు ఇవ్వక పోతే మీడియాకు వీడియోలు లీక్ చేస్తానని కార్తీక్ బెదిరించాడని తెలిపిన రాజా రవీంద్ర అంత డబ్బులు ఇవ్వలేక తాము సైలెంట్ అయ్యామని పేర్కొన్నారు. అతని మీద న్యాయ పరంగా ముందుకు వెళ్తామని రాజా రవీంద్ర పేర్కొన్నారు.
 

More Related Stories