English   

శాండిల్ వుడ్ కి వాల్మీకి ఐటెం భామ  

Dimple Hayathi
2019-08-23 17:17:50

వరుణ్ తేజ్ లీడ్ రోల్ లో హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మూవీ వాల్మీకి. ఈ సినిమాలోని ఐటెం సాంగ్ లో మెరిసింది ఒక భామ. నిజానికి సాధారణంగా తొలి సినిమా చేసేటప్పుడు హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్‌ పాత్రలనే ఎంచుకుంటారు. యూత్‌ని ఆకట్టుకుంటే హీరోయిన్‌ గా సగం సక్సెస్ అయినట్టేనని భావించి అలా చేస్తూ ఉంటారు. కానీ వీరికి భిన్నంగా ఆలోచించి మరీ హైదరాబాదీ అమ్మాయి డింపుల్‌ హయాతి ‘గల్ఫ్‌’ అనే సినిమా చేసింది. ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయిన ఈ భామ, మొదటి సినిమాతో వచ్చిన ముద్రను చెరిపెందుకు వరుణ్ తో ఆడిపాడింది. ఈ దెబ్బతో ఆమె తాజాగా శాండల్‌వుడ్‌లో ఛాన్స్ దక్కించుకుందని అంటున్నారు.  ప్రభుదేవా తమన్నాలు కీలక పాత్రలు పోషించిన 'దేవి-2'లో కూడా కీలక పాత్ర పోషించిన డింపుల్ తన నటన తో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. తాజాగా ప్రముఖ కన్నడ దర్శకుడు చంద్రమౌళి డైరెక్ట్ చేయబోయే కొత్త సినిమాలో ఈమెను హీరోయిన్ గా ఎంపిక చేశాడట. దీంతో ప్రస్తుతం కన్నడ నేర్చుకునే పనిలో బిజీగా ఉందని అంటున్నారు. నిజంగా తెలుగు అమ్మాయిలకు తెలుగులో ఛాన్సులు ఎక్కువగా రావు, వచ్చినా అవి ఎక్కువ కాలం నిలబెట్టుకోలేదు. కానీ తమిళంలో మాత్రం ఈ భామలను బాగానే ఛాన్సులు వస్తున్నాయి. మరి హయతి ఏమేరకు ఆ బాషలో రాణిస్తుంది అనేది చూడాలి.

More Related Stories