English   

ప్రభాస్ కు నిద్ర లేకుండా చేసిన సాహో సినిమా.. 

Saaho
2019-08-23 18:16:28

బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగింది అనుకున్నారు కానీ దాంతో పాటే బాధ్యత కూడా పెరిగింది. మార్కెట్ పెరిగినపుడు ఆటోమేటిక్ గా బడ్జెట్ కూడా పెరుగుతుంది. సాహోకు ఇదే జరిగింది. ముందు 100 కోట్లతో అనుకున్న సినిమా కాస్తా ఇప్పుడు ఏకంగా 350 కోట్లు అయిపోయింది. దాంతో ఏ హీరో అయినా కూడా టెన్షన్ పడక తప్పదు. ఇప్పుడు ప్రభాస్ పరిస్థితి కూడా ఇలాగే మారిపోయింది. ఈయన నటించిన బాహుబలిని ఎప్పటికీ మర్చిపోలేరు ప్రేక్షకులు. ఇదే విషయాన్ని ప్రభాస్ కూడా చెప్పాడు. ఆ సినిమాతో తనకు అభిమానులు వచ్చారని.. వాళ్లలో ఎవరు ఎక్కువగా నచ్చారు అంటే చెప్పడం కష్టం అంటున్నాడు ప్రభాస్. ఎక్కడో గుజరాత్లో కూడా కొందరు పిల్లలు బాహుబలిలో పాటల్ని పాడుతున్నారని తన ఫ్రెండ్స్ చెప్పారంటున్నాడు ప్రభాస్. ఇది తలుచుకున్నపుడు కచ్చితంగా ఆనందంగా ఉంటుంది.. అదే సమయంలో భయంగా కూడా ఉంటుంది.. ఒత్తిడి పెరిగిపోతుందంటున్నాడు ప్రభాస్. ఇప్పుడు రానున్న 'సాహో' కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను అంటున్నాడు ప్రభాస్. ఎందుకంటే తనను ఇప్పుడు దేశం మొత్తం గుర్తుపడుతున్నారని.. ప్రపంచంలోనూ కొన్నిచోట్ల అభిమానిస్తున్నారని.. నిజంగా కల నెరవేరిందా అనిపిస్తోందంటున్నాడు ప్రభాస్. ఇప్పటివరకు ఎన్నోసార్లు ముంబయి వెళ్లినా గుర్తు పట్టేవాళ్లు కాదు కానీ ఇప్పుడు అందరూ గుర్తుపట్టి సెల్ఫీలు కూడా అడుగుతున్నారని సంతోషంగా చెబుతున్నాడు ప్రభాస్. క్వాలిటీ ఉన్న సినిమాలు చేయాలని ఉంది కాబట్టే టైమ్ ఎక్కువగా పడుతుందని.. యాక్షన్ పార్ట్ ఎక్కువున్న సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఆరేళ్లలో మూడు సినిమాలు మాత్రమే చేసాను అంటున్నాడు ప్రభాస్. ఇకపై ఏడాదికి ఓ సినిమా చేయడానికి ప్రయత్నిస్తానంటున్నాడు యంగ్ రెబల్ స్టార్.

More Related Stories