English   

మెగాస్టార్ చేతుల మీదుగా ఎస్వీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

svr
2019-08-23 19:03:09

చదువుకు తగ్గట్టుగా మంచి గవర్నమెంటు ఉద్యోగం వచ్చింది. కానీ అక్కడితో సరిపెట్టుకుని ఉంటే ఎస్వీఆర్‌ అనే నటుడు మనకు దొరికేవాడా ? అగ్నిమాపకశాఖలో పనిచేసే ఓ ఉద్యోగిగా ఆయన మిగిలిపోయి ఉండేవారేమో. నటనంటే ఆయనకు పంచప్రాణాలు కనుక ఉద్యోగాన్నీ వదిలేశారు. ఇంట్లోవాళ్ళకు ఇష్టం లేకపోయినా ముఖ్యంగా తన తండ్రికి ఇష్టం లేకపోయినా.. సినిమా నటుడవ్వాలనే కోరికతో మద్రాసు రైలెక్కేశారు. అన్హుకే తెలుగు సినిమా ప్రేక్షకులు మాకూ ఎస్వీఆర్‌ అనే మహానటుడున్నాడని సగర్వంగా చెప్పుకోగలిగే భాగ్యం కలిగింది. ఆయన కాంస్య విగ్ర‌హాన్ని తాడేప‌ల్లి గూడెం య‌స్.వి.ఆర్. స‌ర్కిల్, కె.య‌న్.రోడ్ లో ప్రముఖ హీరో చిరంజీవి ఆవిష్క‌రించ‌నున్నారు.
ఈ నెల 25వ తేదీన ఉద‌యం 10.15 నిమిషాల‌కు ఎస్వీఆర్ అభిమానుల స‌మ‌క్షంలో ప‌ద్మ‌భూష‌ణుడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ విగ్ర‌హావిష్క‌ర‌ణ జ‌ర‌గ‌నుందని సమాచారం. ఈ విగ్రహం ఆవిష్కరించేందుకు మెగాస్టార్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి బయలుదేరి ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగి అక్కడ నుండి రోడ్ మార్గాన తాడేపల్లిగూడెం చేరుకుంటారు.  అయితే సినీ పరిశ్రమలో దిగ్గజాలుగా ఉన్న హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న చిరంజీవి ఎస్వీ రంగారావుతో మాత్రం తాను కలిసి నటించలేకపోయానని సినీ రంగంలో తాను లోటుగా భావించే విషయమని ఆ మధ్యన ఆవేదన వ్యక్తం చేశారు.

More Related Stories