English   

ఇస్మార్ట్ పోరితో రొమాన్స్ చేయబోతున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్..

sai
2019-08-23 19:43:45

చిత్రలహరి సినిమా విజయం తరువాత సాయి ధరమ్ తేజ్ కెరీర్ కు మళ్లీ రెక్కలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత మళ్ళీ దర్శక నిర్మాతలు మెగా మేనల్లుడి వైపు చూస్తున్నారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రతిరోజు పండగే సినిమాలో నటిస్తున్నాడు సాయి. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే సగానికి పూర్తయిపోయింది. ఇది ఏడాది షూటింగ్ పూర్తిచేసి డిసెంబర్లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. గీతా ఆర్ట్స్ 2 ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఇప్పుడు మరో సినిమాకు ఓకే చెప్పినట్లు సాయి ధరమ్. కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మెగా మేనల్లుడు. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే ఈ చిత్రంలో ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నభా నటేష్ నటించబోతుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుంది. ఇప్పటి వరకు కొత్త దర్శకులకు పెద్దగా నమ్మని సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు రిస్క్ తీసుకోవడానికి ముందడుగు వేస్తున్నాడు. కథ నచ్చడంతో కొత్త దర్శకుడు అయినా పర్వాలేదని సాహసం చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. మారుతి సినిమా తర్వాత ఇది పెట్టాలెక్కనుంది. చిత్రలహరితో కోరుకున్న విజయం కాకపోయినా ఉరట ఇచ్చే హిట్ కొట్టాడు సాయి. దాంతో ఇప్పుడు మారుతి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నాడు. మరి ఈయన కోరికను మారుతి, సుబ్బులలో ఎవరు తీరుస్తారో చూడాలి.

More Related Stories