బాండ్ మళ్ళీ రెడీ అయ్యాడు...అమెరికా కంటే ముందుగానే

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదారణ పొందిన సినిమాలు ఏవైనా ఉన్నాయా అంటే టక్కున గుర్తొచ్చేది జేమ్స్ బాండ్ సిరీస్ సినిమాలే. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో 24 సినిమాలు విడుదలయ్యాయి. తాజాగా ఈ సిరీస్‌లో భాగంగా 25వ సినిమా తెరకెక్కుతోంది. డేనియల్ క్రెగ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ 25వ సినిమాకు 'నో టైం టు డై' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఇది వరకు నటించనని చెప్పిన ఆయన మనసు మార్చుకుని మళ్లీ నటిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఈ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంతే కాదండోయ్ సినిమా టైటిల్ తో పాటుగా ఈ సినిమా విడుదల తేదీని కూడా ఓకే సారి ప్రకటించింది సినిమా యూనిట్. ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 8న అమెరికాలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
అంతే కాక ఈ సినిమా అమెరిక విడుదల కంటే ముందే సరిగ్గా ఐదు రోజులు ముందుగానే ఏప్రిల్ 3న ఇండియాలో విడుదలవుతుంది. ఎంఐ6 ఏజెంట్ గా బాధ్యతల నుంచి తప్పుకుని జమైకాలో విశ్రాంతి తీసుకుంటున్న బాండ్ దగ్గరికి అపహరణకు గురైన ఓ శాస్త్రవేత్తను కాపాడమని వస్తారని, అందుకే మళ్లీ బాండ్‌ను విధుల్లోకి తీసుకొస్తారని, దీని ఆధారంగానే కథ ఉండబోతోందని హాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో మళ్ళీ రంగంలోకి దిగిన బాండ్ ఎలా అతన్ని పట్టుకున్నాడు అనే లైన్ మీద ఈ సినిమా తెరకక్కుతోంది. ఈ సినిమాకు కేరీ దర్శకత్వం వహిస్తున్నారు. నార్వే, లండన్, ఇటలీలో సినిమాను చిత్రీకరణ జరిగింది. మొదట ఇండియాలో ఈ సినిమా షూట్ చేద్దామని అనుకున్నా ఇండియన్ రైల్వే పర్మిషన్ ఇవ్వకపోవడంతో అది కుదరలేదు.