English   

ఎన్టీఆర్ అభిమానులకి బిగ్ న్యూస్ 

NTR RRR
2019-08-24 12:08:45

బాహుబలి తర్వాత దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మెగా హీరో రామ్ చరణ్, నందమూరి హీరో ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆర్‌ఆర్‌ఆర్ కొత్త షెడ్యూల్‌ కోసం ఈ యూనిట్ రెండ్రోజుల క్రితమే బల్గేరియా వెళ్ళింది. ఈ షెడ్యూల్‌లో కేవలం ఎన్టీఆర్‌ మాత్రమే పాల్గొంటారని సమాచారం. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించనుండగా, కోమరం భీమ్ పాత్రను తారక్ పోషిస్తున్నారు. అయితే అందుతున్న తాజా సమాచారం ప్రకారం కొమరం భీమ్ జన్మదినమయిన అక్టోబర్ 22న కొమరం భీమ్‌గా తారక్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని చెబుతున్నారు. అయితే దానికి ఇంకా రెండు నెలలు సమయం ఉన్నా, ఇప్పటికే ప్రచారం మాత్రం మొదలయిపోయింది. 

ఇక సైరా సినిమా నిర్మించి ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ అక్టోబర్ నుండి ఈ సినిమా షూట్లలో చేరనున్నారని అంటున్నారు. అప్పటి దాకా ఎన్టీఆర్ సింగిల్ షెడ్యూల్స్ షూట్ చేస్తారని అంటున్నారు. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 2020 జూలై 30 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు, ఇందులో ఆమె చరణ్‌ సరసన నటించనుంది. ఇక ఈ సినిమాలో తారక్ సరసన నటించే భామ కోసం ఎన్నో చోట్ల వెతుకుతున్నారు రాజమౌళి. మొన్న ఒక బ్రిటీష్ హీరోయిన్ పేరు బయటకి వచ్చినా దానిని అధికారికంగా ద్రువీకరించాల్సి ఉంది.  
 

More Related Stories