English   

బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయ్యేది ఆమేనా ?

 Ashu Reddy
2019-08-24 13:53:04

బిగ్ బాస్ హౌస్‌లో ఐదో వారం ఆట రంజుగా సాగుతోంది. ఈ వారం ఏడుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్‌ జోన్‌లో ఉండటంతో ఎవరు ఈవారం బిగ్ బాస్ హౌస్‌ను వీడబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. అయితే ప్రతి వారం లానే సాగుతున్న లీక్ లు ఈవారం కూడా సాగుతున్నాయి. ఈ వారం ఎలిమినేషన్ జోన్ లో రాహుల్, హిమజ, అషు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్‌‌లు నామినేట్ అయ్యారు. ఈ ఏడుగురులో హౌజ్‌లో ఉండేవి ఎవరు? వెళ్లేది ఎవరో నిర్ణయించేది ప్రేక్షకుల ఓటింగ్. అయితే వీరిలో నామినేషన్ ప్రక్రియలో ఎక్కువ ఓట్లు వచ్చి మొదటి స్థానంలో రాహుల్ సిప్లిగంజ్ ఉన్నాడు, అంత ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నాడు కనుకనే ప్రేక్షకుల వోటింగ్ లో సింపతీ చూపించి ఎక్కువగా వోట్లు వచ్చాయని అంటున్నారు. మిగిలిన వారిలో బాబా భాస్కర్ కి చాలా ఫాలోయింగ్ ఉంది, ఇక శివజ్యోతి, పునర్నవిలకి నెగెటివిటీ లేకపోవడం వలన వారు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. మహేష్ విట్ట తను చేసిన పనులకు వివరణ ఇవ్వడంతో అతని మీద కూడా సింపతీ పెరిగినట్టు సమాచారం. ఇక మిగిలిన హిమజ, ఆషు రెడ్డిలో అషు రెడ్డి ఎలిమినేట్ అయ్యినట్టు చెబుతున్నారు. మరి ఈ విషయం ఈరోజే ప్రకటిస్తారో రేపు ప్రకటిస్తారో చూడాలి మరి.

More Related Stories