English   

సాహో తొలిరోజు అంచనాలు ఎలా ఉన్నాయి.. కలెక్షన్ ఎంత..

Saaho
2019-08-24 18:39:08

రెండేళ్ల కింద బాహుబలి సినిమా విడుదలైనప్పుడు బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. ఒక్క రికార్డు కూడా లేకుండా అన్ని రాజమౌళి సినిమా పేరు మీదకి వచ్చేసాయి. ఇప్పుడు అదే అంచనాలతో సాహో కూడా వస్తుంది. విచిత్రం ఏమిటంటే ఇందులో కూడా ప్రభాస్ హీరో కావడం. అప్పుడు రాజమౌళి అండతో తొలి రోజు 121 కోట్ల షేర్ వసూలు చేశాడు ప్రభాస్. తెలుగు తమిళ హిందీ మలయాళం అన్ని భాషల్లోనూ రికార్డు ఓపెనింగ్స్ సాధించింది బాహుబలి 2. కానీ ఇప్పుడు సాహోతో ఈయన ఏం చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ట్రేడ్ విశ్లేషకులు అంచనా బట్టి చూస్తే సాహో తొలిరోజు ఈజీగా 80 కోట్ల షేర్ వసూలు చేస్తుందని లెక్కలు వేస్తున్నారు. తెలుగులో దాదాపు 40 కోట్ల వరకు షేర్ తీసుకొస్తుందని.. అలాగే హిందీలో కూడా 30 కోట్లకు పైగానే తొలిరోజు వస్తాయని లెక్కలు కడుతున్నారు ట్రేడ్ పండితులు. ఇక తమిళ మలయాళ కన్నడ లో కలిసి 10 కోట్ల వరకు షేర్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఎటు చూసినా కూడా సాహో తొలిరోజు 80 కోట్లకు పైగా షేర్ కేవలం ఇండియాలోనే వసూలు చేస్తుందని.. ఓవర్సీస్ కూడా కలుపుకుంటే కచ్చితంగా తొలి రోజు 100 కోట్లు వస్తాయని అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాపై ఉన్న ఆసక్తి చూస్తుంటే 100 కోట్లు రావడం పెద్ద విషయం కాదనిపిస్తుంది. తొలి రోజు పాజిటివ్ టాక్ వచ్చిందంటే 3 రోజుల్లోనే దాదాపు 250 కోట్ల వరకు వసూలు చేయడం ఖాయం. మరి ఈ లెక్కలన్నీ నిజం కావాలంటే సినిమా బ్లాక్ బస్టర్ కావాల్సిందే. ఒకవేళ అయ్యిందంటే మాత్రం ప్రభాస్ రేంజ్ అమాంతంగా పెరిగిపోవడం ఖాయం.

More Related Stories