రవి తేజ యంగ్ లుక్....నిజం కాదన్న డైరెక్టర్

నిన్నటి నుండి ఒక పిక్ సోషల్ మీడియాని కుదిపేసింది, రవితేజ పోలికలతో ఉన్న ఒక పిక్ నిన్న తెగ వైరల్ అయ్యింది. రవితేజ ప్రస్తుతం డిస్కో రాజా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల ఫేం వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్ ’ ఫేమ్ నభా నటేశ్‌ను ఓ నాయికగా, ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్‌ను మరో నాయికగా ఎంపిక చేశారు. వెన్నెల కిషోర్, సునీల్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే నిన్నటి నుండి ఈ పిక్ తెగ వైరల్ కావడంతో ఆ దర్శకుడు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. దర్శకుడు ఆనంద్ తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
రవితేజ కొత్త లుక్ అంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. డిస్కోరాజా కోసం ఈ ఫోటోని ఎక్కడ ప్రమోట్ చేయలేదని ఆయన పేర్కొన్నాడు. అయితే రవితేజ కుర్ర లుక్ ని త్వరలోనే అఫీషియల్ గా విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. అంతవరకు ఇలాంటి వార్తలు సర్క్యులేట్ చేయవద్దని ఆనంద్ కోరారుపేర్కొన్నారు. అయితే ఈ సినిమాలో తమిళ స్టార్ బాబీ సింహా కూడా నటిస్తున్నారు, అయితే అది ప్రతి నాయక పాత్రనా లేక ఇంకేమన్నానా అనేది తేలాల్సి ఉంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తుండగా, తాజాగా యంగ్ లుక్ బయటకి రావడంతో అది నిజమే అని నమ్మేశారు అందరూ.