English   

విజయ్ కొత్త సినిమా ప్రకటన...కానీ

vijay
2019-08-25 08:24:03

తమిళనాట ఇళయదళపతిగా ఫేమస్ అయిన  స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'బిగిల్' చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో తండ్రిగా, కొడుకుగా విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమా షూట్ దాదాపు పూర్తి కావడమే కాక దీపావళికి రిలీజ్ కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉండగా విజయ్ తన తదుపరి సినిమాని కూడా పట్టాలు ఎక్కించేందుకు సిద్దమయ్యాడని వార్తలు వినిపించాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా గురించి కాస్త సస్పెన్స్ కొనసాగినా ఎట్టకేలకి దాని మీద క్లారిటీ ఇచ్చేశారు. తన మొదటి చిత్రం మానగరంతో పేరుతెచ్చుకున్న లోకేష్ కనగరాజ్, విజయ్ హీరోగా సినిమా ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ కి ఇంకా ఫిక్స్ కాకపోగా దీనిని దళపతి 64 గా పిలుస్తారు.

ఈ సినిమా గత నెలలోనే మొదలుపెట్టినా నిన్న అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాని జేవియర్ బ్రిట్టో తన ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్  బ్యానర్‌లో నిర్మించనుంది. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్, స్టంట్ డైరెక్షన్ ‘స్టంట్’ సిల్వా మరియు ఆర్ట్ డైరెక్టర్ సతీష్ కుమార్. ఈ సినిమా షూటింగ్ 2019 అక్టోబర్ నాటికి ప్రారంభమవుతుందని అంటున్నారు, ఇక ఈ సినిమాని 2020 ఏప్రిల్ నాటికి విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్‌ సరసన  త్రిష, రకుల్ ప్రీత్ లు నటిస్తారని తొలుత ప్రచారం జరిగింది. ఆ తర్వాత రష్మిక మందన్న రాఖీఖన్నా పేరు వినిపిస్తున్నాయి. చూడాలి వీరిలో ఎవరు ఈ ఛాన్స్ కొట్టేశారో వేచి చూడాలి.

 

More Related Stories