English   

విక్రమ్ ఇంటి నుండి మరో హీరో ఎంట్రీ

vikram
2019-08-25 08:40:33

ఇండస్ట్రీలోకి వారసులు రావడం చాలా కామన్ విషయం. మన తెలుగులో చూస్తే ఎన్నో ఫ్యామిలీల నుండి ఎంతో మంది వారసులు తెరంగ్రేటం చేశారు. ఎంత మంది చేసినా అది టాలెంట్ మీదనే ఆధార పడి ఉంటుందనేది తెలిసిన విషయమే. అయితే అందుతున్న సమాచారం ప్రకారం హీరో విక్రమ్ మేనల్లుడు కూడా తెరంగ్రేటం చేయడానికి సిద్దం అవుతున్నారు. ఇప్పటికే విక్రమ్ తమిళంలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. ఇక విక్రమ్ నట వారసుడిగా ఆయన తనయుడు ధ్రువ్‌ కూడా ‘ఆదిత్య వర్మ’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
తెలుగులో అర్జున్ రెడ్డి కి ఇది రీమేక్. ఇక ఇప్పుడు విక్రమ్ ఇంటి నుండి ఆయన మేనల్లుడు హీరోగా పరిచయం కానున్నాడు. విక్రం సోదరి అనిత కుమారుడు అర్జుమన్‌ విజయ్‌ శ్రీజి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ‘దాదా 87’ సినిమా ద్వారా ఈయన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అర్జుమన్ సినిమాకి ‘పొల్లాద ఉలగిన్‌ భయంగర గేమ్‌’ అనే టైటిల్ ని ఖరారు చేశారని అంటున్నారు. ఈ సినిమాలో బిగ్‌బాస్‌ ఫేమ్‌ ఐశ్వర్య అర్జుమన్ కి జోడీగా నటిస్తుందని అంటున్నారు. జీడీఆర్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయింది. రెండో షెడ్యూల్‌ను సెప్టెంబరులో తెరకెక్కించనున్నారు.

 

More Related Stories