English   

అజిత్ దర్శకుడితో ధరమ్ తేజ్ ?

sai
2019-08-25 19:43:12

ఎన్నో సినిమాల దండయాత్ర తర్వాత సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన “చిత్రలహరి” సినిమాతో హిట్ కొట్టి ఫ్లాప్ ల పరంపరకి బ్రేక్ వేశాడు. ఇక ఆ సినిమా సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న ఆయన దర్శకుడు మారుతితో “ప్రతీ రోజు పండగే అనే విలేజ్ బేస్డ్ స్టోరీ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే  తేజూ సినిమాల గురించి ఈ మధ్య తరచుగా ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ మధ్య కూడా ఆయన సుబ్బు అనే నూతన దర్శకుడితో సినిమా చేయనున్నాడని ప్రచారం జరిగింది.
ఆ విషయం మీద ఇంకా క్లారిటీ రాకుండానే ఆయన మరో దర్శకుడితో సినిమా చేస్తున్నాడని ప్రచారం మొదలయ్యింది. సాయి ధరమ్ తేజ్ తన తదుపరి చిత్రం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో కలిసి చేస్తున్నట్టుగా ప్రచారం మొదలయింది. ఈయన దాదపు ఏడెనిమిదేళ్ళ క్రితం అజిత్‌ కు భారీ హిట్ గా నిలిచిన “మాకథ” అనే సినిమా తెరకెక్కించారు. మరి ఇందులో నిజం ఎంతుందో తెలీదు కానీ అజిత్ దర్శకుడితో ధరమ్ తేజ్ అనే వార్త మాత్రం హల్చల్ చేస్తోంది.

More Related Stories