English   

సాహో సినిమాకు షాక్ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం..

Saaho
2019-08-26 09:12:15

మరో 5 రోజుల్లో సాహో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాంతో దర్శక నిర్మాతలు ఈ చిత్ర రిలీజ్ పనులతో బిజీ అవుతున్నారు. మరోవైపు 350 కోట్లతో తెరకెక్కిన సినిమా కాబట్టి ఏపీ తెలంగాణలో ప్రభుత్వం నుంచి కొన్ని ప్రత్యేక అనుమతులు కోరుతున్నారు మేకర్స్. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కోరిన విధంగా ఉత్తర్వులు జారీ చేశారు కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దర్శకనిర్మాతలు ప్రభుత్వాన్ని కోరుతున్న ఆ కోరిక ఏంటో తెలుసా.. విడుదలైన తొలి వారం రోజులకు మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్లు పెంచి అమ్ముకోవడం. ఇప్పటికే సింగిల్ స్క్రీన్స్ లో హైయెస్ట్ టికెట్ రేట్ 200 ఉండేలా ఏపీ ప్రభుత్వం అనుమతి కోరింది. సాహో యూనిట్ దీనికి అక్కడి నుంచి సానుకూల స్పందన వచ్చింది. రెండు వారాలు టికెట్ 200 ఉండేలా పర్మిషన్ ఇచ్చేశారు. ఇది మధ్య తరగతి ప్రేక్షకులకు భారీ మొత్తంలో కనిపిస్తున్నా కూడా అభిమానులు మాత్రం ఈ టికెట్ రేట్లు గురించి పెద్దగా ఆలోచించడం లేదు. వాళ్లు ప్రభాస్ సినిమా చూడాలనే ఉత్సాహంతో కనిపిస్తారు. కానీ మధ్య తరగతి కుటుంబాలకు మాత్రం సాహో టికెట్ రేట్ గుదిబండలా కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు పెంచుకోవడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. గతంలో కూడా కొన్ని సినిమాలు టికెట్ రేట్ పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వంను అనుమతి అడిగితే ఇవ్వలేమని తేల్చి చెప్పేశారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. సింగిల్ స్క్రీన్స్ లో 200 టికెట్ రేట్ చేస్తే అది మధ్యతరగతి ఇ ప్రేక్షకులకు కష్టంగా మారుతోందని భావిస్తున్నారు. అందుకే తెలంగాణ నుంచి దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా కనిపించడం లేదు. మరోవైపు ఏపీ ప్రభుత్వం మాత్రం మీ ఇష్టం అన్నట్టుగా సాహోకు అనుమతులు ఇచ్చేసింది.

More Related Stories