English   

క్యాస్ట్ ఫీలింగ్ చూపించిన వర్మ

Ram Gopal Varma
2019-08-26 12:19:05

సంచనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచనానికి తెరతీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో తెలుగు రాజకీయాలలో రచ్చ రేపిన ఆయన ఇప్పుడు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ మరో సినిమాకు రెడీ అయ్యారు. ఇప్పటికే దీనికి సంబంధించిన టైటిల్‌ సాంగ్‌ను కూడా రిలీజ్ చేసిన వర్మ ఈ సినిమాలో వివాదానికి తావే ఉండదని కూడా చెప్పాడు. అంతే కాదు టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఒట్టు వేశారు. అయితే, పాటను కమ్మ రాజ్యంలోకి కడప రెడ్లు వచ్చిన తర్వాత అంటూ మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు మరో రచ్చ మొదలెట్టారు. అదేంటంటే క్యాస్ట్ ఫీలింగ్ అనే సాంగ్ ప్రోమోని, అలాగే పూర్తి పాటను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు వర్మ. 

ఈరోజు ఉదయం తొమ్మిది 26కి ప్రోమో, రేపు తొమ్మిది 27కి పూర్తి సాంగ్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే అక్కడితో వదిలేస్తే బాగానే ఉండేది కానీ చివర్లో జై సాహో జై ప్రభాస్ అని పేర్కొనడం చర్చకు తావిచ్చింది. అయితే ప్రస్తుతం సాహో ఫీవర్ భీబత్సంగా ఉన్న నేపధ్యంలో ఆయన అన్నాడని భావించినా తర్వాత ఆయన చేసిన మరో ట్వీట్ మళ్ళీ చర్చకు తావిచ్చింది. అంటే ఆయన లెక్క ప్రకారం ప్రభాస్ తన సొంత క్యాస్ట్ కాబట్టే జై ప్రభాస్ అన్నాడట, అలా అర్ధం వచ్చేలా మరో వ్యక్తి చేసిన ట్వీట్ ని ఆయన రీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో రాజు కులానికి చెందిన కొందరి పేర్లు చెబుతూ జై చెబుతూ ట్వీట్ చేశారు. చూద్దాం ఈ రచ్చ ఎంత దూరం వెళుతుందో ?

More Related Stories