English   

రిలీజ్ రోజునే ప్రభాస్ మల్టీప్లెక్స్ లాంచ్..అతిధులెవరబ్బా ?

Saaho
2019-08-26 12:42:33

తెలుగు హీరోలు నటించడం ఒక్కటే కాక తమకు నచ్చిన సినీరంగంలోనే ఏవో రకమైన పెట్టుబడులు పెడుతూ లాభాలుపొందుతున్నారు. కొందరు ఇప్పటికే సొంతగా స్టూడియోలను నిర్మించి  ఉంటే మరి కొందరు ప్రొడ్యూసర్లుగా మారి సినిమాలను తీస్తున్నారు. ఇక ఈ మధ్య మల్టీ ప్లేక్స్ వ్యాపారం కూడా మొదలయ్యింది. ఇప్పటికే మహేష్ ఎఎంబీ సినిమాస్ పేరుతో మల్టీ ప్లేక్స్ మొదలుపెట్టగా ప్రభాస్ కూడా తన స్నేహితులతో కలిసి మల్టీప్లెక్స్ ఒకటి నిర్మించారు. నెల్లూరు సూళ్లూరుపేట మెయిన్ రోడ్ మీద రెండేళ్లుగా ప్రభాస్ సొంత మల్టీప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది. వీ-ఎపిక్ పేరుతో ఇప్పటికే నిర్మాణం ముగించుకుంది. ఈ మల్టీప్లెక్స్ థియేటర్‌ని ఆగస్టు 30న సాహో సినిమా రిలీజ్ సందర్భంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

అయితే ఈ వీఎపిక్ ప్రారంభోత్సవానికి వచ్చే అతిధులు ఎవరా అనే చర్చ నడుస్తోంది. అయితే ముందు నుండీ ఎవరైనా హీరోలను తీసుకొచ్చి ఓపెన్ చేయాలని భావించినా అది కుదిరేలా కనిపించడం లేదు. అయితే ప్రభాస్ ఎటూ ఉండనే ఉంటాడు అనుకుంటే అదే రోజు సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఆయనకి  కుదరకపోవడంతో ప్రారంభోత్సవానికి వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. అయితే ఈ వేడుకకు పెద్ద స్టార్లను ఎవరినీ పిలవకూడదని భావిస్తున్న నిర్వాహకులు ఆరోజు సాహో చిత్రం ప్రదర్శించి వీఎపిక్ థియేటర్స్ ని అధికారికంగా లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక ఓపెనింగ్ కి రెబల్ స్టార్ కృష్ణంరాజు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరవుతారని చెబుతున్నారు. ఇక సాహో యూనిట్ లోని కొంతమంది కూడా ఈ ప్రారంభోత్సవానికి హాజరవనున్నారని అంటున్నారు.

More Related Stories