English   

ప్రభాస్ మల్టీప్లెక్స్ లాంచ్ కు ఉపరాష్ట్రపతితో పాటు ఆ స్టార్..

 Prabhas
2019-08-26 17:12:54

ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఆగస్టు 30న విడుదల కానుంది. అయితే ఇదే సినిమాతో ప్రభాస్ తన సొంత థియేటర్ కూడా లాంచ్ చేయబోతున్నాడు. ఇప్పటి వరకు మహేష్ బాబు థియేటర్ రంగంలోకి అడుగు పెట్టాడు. ఇక్కడ కూడా తన మార్కు చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు సూపర్ స్టార్. హైదరాబాద్లో ఏఎంబి సినిమాస్ ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది. ఇక ఇప్పుడు ప్రభాస్ కూడా థియేటర్ బిజినెస్ లోకి కాలుమోపాడు.  తన సొంత నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ తో కలిసి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరు పేటలో 'వి ఎపిక్' పేరుతో ఈ మల్టీప్లెక్స్ ని నిర్మించారు. సౌత్ ఏషియా లో ఇప్పటి వరకు ఇంత పెద్ద స్క్రీన్ లేదని తెలుస్తోంది. 750 సీటింగ్ కెపాసిటీతో వస్తున్న ఈ మల్టీప్లెక్స్ లేటెస్ట్ డాల్బీ ఆట్మస్ సౌండ్ ఎక్విప్మెంట్ తో ముస్తాబైంది. ఈ మల్టీప్లెక్స్ కోసం దాదాపు 60 కోట్లు ఖర్చు పెట్టారు. ఇందులో మూడు స్క్రీన్‌లు ఉన్నాయి. స్క్రీన్ 1, స్క్రీన్ 2 లు 375 సిట్టింగ్ కెపాసిటీతో నిర్మించారు. స్క్రీన్ 3 మాత్రం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ఈ స్క్రీన్ ఎత్తు దాదాపు 100 అడుగులు. అసలే సిక్స్ ఫీట్ కటౌట్ ఉండే ప్రభాస్ ను ఈ స్క్రీన్ పై చూడాలని అభిమానులు కూడా ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కి  ప్రభాస్ పెదనాన్న , నటుడు కృష్ణరాజు.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ కూడా ఈ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కు రానున్నాడని తెలుస్తోంది. ఆగస్టు 29న స్పెషల్ చార్టెడ్ హెలికాప్టర్ లో ఆయన సులూరుపేట వచ్చి రిబ్బన్ కట్ చేసి వెళ్తాడని తెలుస్తోంది.
 

More Related Stories