English   

ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసిన సాహో 

 Saaho
2019-08-27 10:02:18

ప్రస్తుతం టాలీవుడ్ సహా అన్ని బాషల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సాహో. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ హీరోయిన్ గ తెరక్కెక్కుతున్న సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. రన్ రాజా రన్  ఫేమ్ సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమాని ప్రభాస్ స్నేహితులు వంశీ ప్రమోద్, విక్కీలు తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరక్కించిన ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీ రేంజ్ లో ప్లాన్ చేసారు మేకర్స్. అందుకు తగ్గట్టే మునుపెన్నడూ లేని విధంగా ప్రభాస్ ఈ సినిమా కోసం ఇరవైరెండు నగరాల్లో ప్రమోషన్స్ చేస్తున్నాడు,

అయితే తాజాగా ఈ సినిమా నిర్మాతలు ఏపీ ప్రభుత్వానికి ఒక లేఖ రాసారు, అదేమని అంటే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన కారణంగా ఏపీలో స్పెషల్ బెనిఫిట్ షోలు వేసుకోడానికి అనుమతులు ఇప్పించాలని పేర్కొంటూ లేఖ రాశారు. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా వారం రోజుల పాటు ఈ సినిమాకి అర్ధరాత్రి ఒంటిగంట నుండి ఉదయం పది గంటల డాకా కూడా షో వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతో ఏపీ ప్రిన్సిపాల్ సెక్రటరీకి లేఖ రాసింది ఈ యూనిట్. ఇక ఈ సినిమాతో పాటే ప్రభాస్, మూవీ క్రియేషన్స్ వాళ్ళు కలిసి నిర్మించిన అతిపెద్ద మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కూడా జరగనుంది.    

More Related Stories