English   

వాల్మీకి వాయిదా తప్పదా ?

Valmiki
2019-08-27 10:46:07

జెర్సీ సినిమాతో హిట్ కొట్టిన న్యాచురల్ స్టార్ నాని, తాజాగా గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హత్తుకునే సినిమాలు తీస్తాడనే పేరున్న విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే ప్రకటించారు. రెండ్రోజుల ముందే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టింది ఈ సినిమా యూనిట్. నిజానికి ఈ సినిమా ఆగస్ట్ 30న విడుదల చేస్తున్నట్లు తొలుత ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఆగష్టు 15న రిలీజ్ కావలసిన సాహో సినిమాను పోస్ట్ పోన్ చేసి ఆగస్ట్ 30న విడుదల చేస్తుండడంతో ఆలోచనలో పడిన గ్యాంగ్ లీడర్ టీమ్ సాహో లాంటి భారీ సినిమాకి పోటీ వెళ్లడం కంటే వాయిదా వేసుకోవడం మంచిదని భావించి సెప్టెంబర్ 13న రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యి అదే డేట్ ప్రకటించారు. 

అయితే అదే రోజున వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న వాల్మీకి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే రెండు సినిమాల మధ్య పోటీ అని మీడియా హైలైట్ చేసినప్పుడల్లా వాల్మీకి దర్శకుడు హరీష్ శంకర్ పోటీ కాదని ట్విట్టర్ లో కవర్ చేస్తూ వస్తున్నాడు. అయితే, ఇప్పుడు వాల్మీకి వెనక్కి వెళ్ళిందనేది ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఎందుకంటే ఈ రెండు సినిమాలు ఓకే రోజున రిలీజ్ అయితే ఓపెనింగ్స్ లో చీలిక వస్తుంది. అటు నాని గాని, ఇటు వరుణ్ తేజ్ గాని భారీ ఓపెనింగ్స్ తెచ్చే స్టార్స్ కాదు. రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయితే రెండింటికి నష్టమే. అందుకే నాని సినిమా ముందు ప్రకటించినట్లే సెప్టెంబర్ 13కే వస్తుందట. వాల్మీకి ఒక వారం తర్వాత సెప్టెంబర్ 20న రిలీజ్ అవుతుందని అంటున్నారు. దీని మీద ఇంకా అధికారిక ప్రకటన రాలేదు త్వరలోనే రావచ్చని అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో ?

More Related Stories