English   

రంగ్ దే కోసం రంగంలోకి దిగిన దేవిశ్రీప్రసాద్

Devi Sri Prasad
2019-08-27 11:45:54

శ్రీనివాస కళ్యాణం డిజాస్టర్ కావడం ఏడాది గ్యాప్ తీసుకున్న నితిన్, మళ్ళీ ఫాంలోకి వచ్చేసి వరుసగా సినిమాలు ప్రకటించాడు. ప్రకటించడమే కాక వరుసగా సినిమా లాంచ్ లు కూడా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వెండీ కుడుములతో ఒక సినిమా, చంద్రశేఖర్ యేలేటితో ఒక సినిమా, వెంకీ అట్లూరితో మరో సినిమా ప్రకటించారు. చంద్రశేఖర్ యేలేటితో చేయనున్న సినిమా భవ్య క్రియేషన్స్ బ్యానర్ మీద ఆనంద్ ప్రసాద్ నిర్మించనున్నారు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నాడు. ఇక ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ సినిమా చేస్తు్న్నారు. ఈ సినిమాకు ‘రంగ్ దే!’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘గిమ్మీ సమ్ లవ్’ అనేది ట్యాగ్ లైన్. నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా ఎంపికైంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫేమస్ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకు కెమెరామన్‌గా పనిచేస్తున్నారు. ‘రంగ్ దే!’ నితిన్‌కు 29వ సినిమా కాగా వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడట. సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి. ‘భీష్మ’ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. చంద్రశేఖర్ ఏలేటి సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరవాత ‘రంగ్ దే!’ రెగ్యులర్ షూటింగ్ ఉండొచ్చు.  

More Related Stories