English   

ఇలియానా బ్రేకప్...నిజమేనా ?

 Ileana D Cruz
2019-08-27 13:53:45

గోవా భామ ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో విడిపోయిందనే ప్రచారం నిన్నటి నుండి విపరీతంగా మొదలయింది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ఇలియానా చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని, వీరిద్దరికీ వివాహం కూడా జరిగిపోయి ఉండచ్చని ఒకప్పుడు వార్తలు వచ్చాయి. అలాంటిది ఇప్పుడు వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకర్నొకరు అన్‌ఫాలో అవడంతో పాటు ఇలియానా తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి అండ్రూ నీబోన్‌తో ఉన్న ఫొటోలను డిలీట్ చేయడంతో ఈ బ్రేకప్ స్టోరీ ప్రచారం మొదలయింది. లండన్‌కి చెందిన ఫొటోగ్రాఫర్‌ అండ్రూతో ఇలియానా డేటింగ్‌లో ఉందని చాలా రోజులుగా వార్తలు వినపడుతున్నాయి. 

నిజానికి ఆమె ఎప్పుడూ మేము రిలేషన్ లో ఉన్నామని చెప్పకున్నా ఇద్దరు అన్యోన్యంగా ఉండే ఫొటోలను షేర్ చేస్తూ ఈ ఫొటోలను తీసింది అండ్రూనే అంటూ పిక్ కింద క్రెడిట్స్ ఇవ్వడంతో ఆమె అతనితో లవ్ లో ఉందని జనాలు ఫిక్స్ అయిపోయారు. అలాంటిది ఇలియానా అండ్రూతో ఉన్న ఫొటోలను డిలీట్ చేయడంతో పాటు ఒకర్నొకరు అన్ ఫాలో చేయడంతో ఈ ఇద్దరి మధ్య నిజంగానే చెడిందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్ లో ‘పాగల్‌పంతి’ సినిమా చేస్తోంది. అనీజ్ బాజ్మీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే బ్రేకప్ స్టోరీ గురించి ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ అసలు నిజం తెలిసేలా కనపడటం లేదు.

More Related Stories