English   

బాలయ్య భామతో చిందేసిన ప్రభాస్..

Prabhas
2019-08-27 16:13:28

ప్రభాస్ ప్రస్తుతం సాహో ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలవుతుంది. దాంతో అక్కడ కూడా ఆగకుండా ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్. ఇందులో భాగంగానే బాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ టెలివిజన్ షోలకు కూడా హాజరవుతున్నాడు ప్రభాస్. తాజాగా నాచ్ బలియే షోకు కూడా ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ షోకు మాజీ హీరోయిన్ రవీనా టాండన్ జడ్జిగా వ్యవహరిస్తోంది. శ్రద్ధా కపూర్ తో కలిసి ప్రభాస్ షో కి వచ్చాడు. వచ్చిన తర్వాత తెలుగు ఇండస్ట్రీ గురించి రవీనా టాండన్ కూడా ప్రభాస్ తో పలు విషయాలు చర్చించింది. ఆ తర్వాత ఆమెతో కలిసి డాన్స్ చేసే అవకాశం అందుకున్నాడు ప్రభాస్. రవీనాతో ఎవరికైనా డాన్స్ చేయాలని ఉందా అని అడిగిన వెంటనే ప్రభాస్ చెయ్యి ఎత్తి నేను ఉన్నానని చెప్పాడు. స్టేజి పైకి వచ్చిన తర్వాత రవీనా తన మాజీ గర్ల్ ఫ్రెండ్ ప్రభాస్ చెప్పడం అక్కడ ఉన్న వాళ్లందరికీ నవ్వు తెప్పించింది. సాధారణంగా చాలా సిగ్గుతో ముడుచుకుపోయే కూర్చునే ప్రభాస్ నాచ్ బలియే షోలో మాత్రం ఫ్రీ గా కనిపించాడు. ఇదివరకు ఎప్పుడూ ఇంత సరదాగా ప్రభాస్ ని ఏ టెలివిజన్ షోలో చూసింది లేదు. తెలుగు టీవీ షోల్లో వచ్చినా కూడా చాలా సిగ్గుతో మాట్లాడతాడు ప్రభాస్. యాంకర్ అడిగిన దానికి కాకుండా మరో దానికి సమాధానం చెప్పే అలవాటు లేదు. అలాంటిది రవీనాతో మాత్రం స్టెప్పులు ఇరగదీశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ ప్రోమో. 25 ఏళ్ల కింద బాలకృష్ణ బంగారు బుల్లోడు సినిమాలో నటించింది రవీనా. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది. అయితే తెలుగులో స్టార్ హీరోయిన్ కావడంలో రవీనా టాండన్ వెనకబడిపోయింది. చివరగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సరసన పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో నటించింది రవీనా.

More Related Stories