English   

కీర్తి సురేష్ మిస్ ఇండియా ఎలా ఉండబోతుంది..

Keerthy Suresh
2019-08-27 17:31:00

మహానటి లాంటి సంచలన విజయం తర్వాత కీర్తి సురేష్ తెలుగులో పెద్దగా నటించింది లేదు. ఇక్కడ సినిమాలు కూడా ఒప్పుకోవడం లేదు. మన్మధుడు 2 సినిమాలో రెండు నిమిషాలు కనిపించే పాత్రలో మాత్రమే నటించింది. మహానటి లాంటి స్క్రిప్టు దొరికినప్పుడు తెలుగులో సినిమాలు చేస్తాను అంటుంది కీర్తి సురేష్. కానీ అలాంటి కథలు మళ్ళీ మళ్ళీ రావు అని ఆమెకు కూడా తెలుసు. అందుకే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల వైపు దృష్టి పెడుతుంది కీర్తి సురేష్. నేషనల్ అవార్డు కూడా గెలుచుకోవడంతో ఇప్పుడు కీర్తి నటిస్తున్న సినిమాలపై అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం మిస్ ఇండియా అనే సినిమాలో నటిస్తోంది. ఎలాంటి సందడి లేకుండా ఈ సినిమా మొదలైంది. ఇప్పటికే షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాని నరేంద్రనాథ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ మధ్యే విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్లో ఒకవైపు సాంప్రదాయంగా కనిపిస్తూనే మరోవైపు మోడరన్ గా కూడా నటించింది కీర్తి సురేష్. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా బరువు కూడా తగ్గింది మహానటి. నిన్న మొన్నటి వరకు ఎలాంటి సందడి లేని ఈ సినిమాపై టీజర్ విడుదల తోనే ఆసక్తి పెరిగిపోయింది. త్వరలో సినిమా విడుదల కానుంది. కచ్చితంగా మిస్ ఇండియా సినిమాతో మళ్ళీ ఇంకో అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తానని చెబుతుంది కీర్తి సురేష్. మరి ఈ నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.

More Related Stories