అంచనాలు పెంచేస్తున్న అకీరా నందన్..

అకీరా నందన్.. ఈ పేరుకు తెలుగులో చాలా ఇమేజ్ ఉంది. దీనికి కారణం అతడు పవన్ కళ్యాణ్ కుమారుడు కావడమే. రేణుదేశాయ్, పవన్ దంపతుల పుత్రుడే అకీరా నందన్. ఈ కుర్రాడు ఇప్పుడు పూణేలో తల్లితో కలిసి ఉంటున్నాడు. మొన్నటి వరకు ఫోటోల్లో ఎప్పుడు కనిపించినా చిన్న పిల్లోడిలానే కనిపించాడు. కానీ ఈ మధ్యే ఓ ఫోటో విడుదలైంది. ఎవరు సినిమా హీరో అడివి శేష్ తో కాసేపు గడిపిన అకీరా నందన్ ఆయనతో కలిసి ఫోటోలు దిగాడు. ఈ ఫోటోలు ఇప్పుడు మెగా ఫ్యాన్స్.. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ లో ఎక్కడలేని జోష్ నింపుతుంది. నిన్నమొన్నటి వరకు చిన్న పిల్లాడిలా కనిపించిన అకీరా.. అప్పుడే ఇంత ఎదిగిపోయాడా అంటూ సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు. పవన్ అతడికి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు.. పేరు ఇచ్చాడు చాలు. రేపు ఫ్యూచర్ లో పవన్ కొడుకు అనే బ్రాండ్ తోనే అకీరా స్టార్ అయిపోయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. అకీరా ఎదుగుదల చూస్తుంటే మరో మూడు నాలుగేళ్లలోనే హీరోగా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే ఆహార అడుగుల నాలుగు అంగుళాలు పెరిగిపోయాడు అకీరా. మరో రెండు మూడేళ్లలో వరుణ్ తేజ్ ను కూడా మించిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి అకీరాను చూసి ఇప్పుడు అతడి పెదనాన్న చిరంజీవి పాటే.. అదేనండీ ఎంత ఎదిగిపోయావయ్యా అంటూ పాడాలేమో..?