English   

వరుణ్ తేజ్, నాని.. వాట్ ఎన్ అండర్ స్టాండింగ్ గురూ..

nani
2019-08-27 21:25:11

తెలుగు హీరోలు మారిపోయారు అంటే ఏమో అనుకున్నారు కానీ ఇప్పుడు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. ఒకేరోజు రెండు సినిమాలు వస్తే కచ్చితంగా నష్టపోతాం అని తెలిసినపుడు నిర్మాతలు కూడా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సాహో కోసం అప్పటికే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న నాని.. తన గ్యాంగ్ లీడర్ సినిమాను వాయిదా వేసుకున్నాడు. రెండు వారాలు వెనక్కి వెళ్లి సెప్టెంబర్ 13న వస్తానని చెప్పాడు. ఇప్పుడు ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. ఇక అదే రోజు వస్తానని చెప్పిన వరుణ్ తేజ్.. నాని రాకతో ఇప్పుడు తన మనసు మార్చుకున్నాడు. సెప్టెంబర్ 13న రావాల్సిన వాల్మీకి కాస్తా ఇప్పుడు మరో వారం పోస్ట్ పోన్ అయింది. సెప్టెంబర్ 20న ఈ చిత్రం విడుదల కానుందని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కూర్చుని మాట్లాడుకుని తమ సినిమాల విడుదల తేదీలను అడ్జస్ట్ చేసుకున్నారు. ఇదే సంప్రదాయం తెలుగులో కొనసాగిస్తే బాక్సాఫీస్ వార్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయవచ్చు అంటున్నారు అభిమానులు. ముఖ్యంగా నిర్మాతలకు కూడా ఇది చాలా హెల్ప్ కానుంది. ఇప్పుడు కానీ ఒకే రోజు గ్యాంగ్ లీడర్, వాల్మీకి వచ్చుంటే కనీసం 20 కోట్ల వరకు నిర్మాతలు నష్టపోయుండే వాళ్లంటున్నారు ట్రేడ్ పండితులు. మొత్తానికి కూర్చుని మాట్లాడుకుని అంతా సెటిల్ చేసుకుంటున్నారు మన హీరోలు.

More Related Stories