English   

వరుస సినిమాలతో బిజీగా ఉన్న శౌర్య

nags
2019-08-27 21:52:41

ఇటీవలే ఒక సినిమా షూటింగులో గాయపడిన నాగశౌర్య ఆ గాయం నుంచి కోలుకుని వరస సినిమాలను లైన్ లో పెట్టాడు. వారి సొంత బ్యానర్లో 'అశ్వద్ధామ' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి శౌర్యనే కథ అందించగా ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' సినిమా షూటింగు దశలో వుంది. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూళ్లు కూడా పూర్తిచేసేసుకుందట, ఇక ఈయన 'పార్థు' అనే సినిమాని కూడా సెట్స్ మీదకి తీసుకెళ్ళినట్టు చెబుతున్నారు. 'సుబ్రహ్మణ్య పురం' దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తాడని సమాచారం. ఏషియన్ సునీల్ నిర్మించే ఈ సినిమా 'విలు విద్య'కి సంబంధించిన కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందనున్నట్టుగా చెబుతున్నారు. పార్ధు అంటే అర్జునుడు, అర్జునుడు అంటే విలువిద్యకి ఎంతో ఫేమస్. అలాంటి ఆయన పేరిట ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక వీటితో పాటు సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో సౌజన్య అనే డైరక్టర్ తో మరో సినిమా కూడా ఓకే చేసాడన్నది తాజాగా అందుతున్న సమాచారం.

More Related Stories