English   

అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చిన రాజమౌళి.. రామ్ చరణ్ న్యూ లుక్ రిలీజ్..

Ram Charan
2019-08-28 09:35:32

RRR సినిమా గురించి అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా నుంచి ఎప్పుడు ఏ కొత్త అప్డేట్ వచ్చినా కూడా పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకొని రాజమౌళి కూడా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను వరుసగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. షూటింగ్ కు వెళ్లిన తర్వాత ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమా వివరాలన్ని మీడియాకు చెప్పాడు ఈయన. ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ గా షూటింగ్ చేసుకుంటున్న రాజమౌళి.. ఇప్పుడు ఒక పోస్టర్ విడుదల చేసి సినిమాపై ఆసక్తి పెంచేశాడు. ఎలాంటి సమయం సందర్భం లేకుండానే అల్లూరి సీతారామరాజు ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేసాడు రాజమౌళి. అయితే ఇందులో రామ్ చరణ్ ఫేస్ చూపించలేదు. కేవలం ఇది ప్రీ లుక్ మాత్రమే. కానీ ఎప్పటి లాగే  ఇందులో కూడా రాజమౌళి మార్క్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లుక్ అంటూ దీనికి పేరు పెట్టాడు రాజమౌళి. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఎలా ఉంటాడో ప్రేక్షకుల ఊహకే వదిలేసాడు జక్కన్న. మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయి పోస్టర్ కూడా విడుదల కానుంది. అది వచ్చిన తర్వాత మెగాభిమానులు పండగ చేసుకోవడం ఖాయం. జూలై 30, 2020 న సినిమా విడుదల కానుందని మరోసారి కన్ఫర్మ్ చేశాడు రాజమౌళి. మరి జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

More Related Stories