English   

నానిస్ గ్యాంగ్ లీడర్ ట్రైలర్.. రివేంజర్స్ అసెంబుల్.. 

 Nanis Gang Leader
2019-08-28 11:30:32

న్యాచుర‌ల్ స్టార్‌ నాని, విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడు విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా గ్యాంగ్ లీడ‌ర్. ఈ సినిమా ట్రైలర్ విడుద‌లైందిప్పుడు. ఇది చూసిన త‌ర్వాత సినిమా ఎలా ఉండ‌బోతుందో క్లారిటీ వ‌చ్చేస్తుంది. ఐదుగురు ఆడ‌వాళ్ల గ్యాంగ్ కు నాని లీడ‌ర్ గా న‌టిస్తున్నాడు. అందుకే ఈ సినిమా గ్యాంగ్ లీడ‌ర్ అయిపోయింది. చిరంజీవి ఆల్ టైమ్ క్లాసిక్ టైటిల్ అని తెలిసినా.. ఏదైనా తేడా జ‌రిగితే అస‌లుకే మోసం వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని తెలిసినా కూడా ధైర్యం చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. సెప్టెంబర్ 13న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు. 

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ చివ‌రిద‌శలో ఉంది సినిమా. ముఖ్యంగా ఐదుగురు లేడీస్ మ‌ధ్య ఈ క‌థ సాగుతుంది. టీజర్, ఫస్ట్ లుక్ లో కూడా ఇదే చూపించాడు ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కే కుమార్. ఇప్పుడు ట్రైలర్ లో కూడా ఇదే హైలైట్ చేసాడు. బామ్మ, వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను చుట్టూ తిరిగే క‌థ ఇది. ఈ సినిమాలో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు. ఐదుగురు ఆడవాళ్లు తమ పగ తీర్చుకోడానికి మార్గాలు కావాలంటూ ఫేమస్ రివేంజ్ రైటర్ పెన్సిల్ పార్థసారథి అంటే నాని దగ్గరికి వస్తారు. 

వాళ్లకు సాయం చేసే క్రమంలోనే నిజంగానే విలన్ దేవ్ అంటే కార్తికేయతో వైరం పెట్టుకుంటాడు నాని. అప్పుడు అసలు కథ మొదలవుతుంది. అసలు దేవ్ ఆ ఐదుగురు ఆడవాళ్లకు ఏం అన్యాయం చేసాడు. నాని వాళ్లకు ఎలా సాయం చేస్తాడనేది అసలు కథ. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్‌ రవిచందర్ అందిస్తున్నాడు. జెర్సీ సినిమా త‌ర్వాత మ‌రోసారి నాని సినిమాకు ప‌ని చేస్తున్నాడు అనిరుధ్. ఇక ఈ సినిమాకు విదేశీ సినిమాటోగ్రఫ‌ర్ మిరోస్లా కుబా బ్రోజెక్ ప‌ని చేస్తున్నాడు. మ‌రోసారి ఈ చిత్రంతో త‌న స‌త్తా చూపించాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు విక్రమ్ కే కుమార్. స్క్రీన్ ప్లే మార్క్ చూపించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. హ‌లో, 24 సినిమాలు అనుకున్న స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో నిరాశలో ఉన్నాడు విక్ర‌మ్. మ‌రి నాని సినిమాతో ఏం మాయ చేస్తాడో చూడాలిక‌.

More Related Stories