English   

సాహో మూవీకి ఏపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్  

  Saaho
2019-08-28 12:33:10

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో హాలీవుడ్ తరహా టెక్నాలజీతో తెరెకెక్కిన్న చిత్రం 'సాహో'. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి ఏపీ ప్రభుత్వం తీపి కబురునందించింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన తమ సినిమాని రోజుకి ఆరు ఆటలు ఆడేలా పర్మిషన్ ఇప్పించాలని ఈ చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాక తమ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రీత్యా రెట్లు పెంచి అమ్ముకునేలా కూడా పర్మిషన్ ఇప్పించాలని కోరింది. భారీ బడ్జెట్ సినిమా కావడంతో స్పెషల్ షోల కోసం అనుమతి ఇవ్వాలని ఏపీ చీఫ్ సెక్రటరీకి దరఖాస్తు చేశారు. భారీగా ఉన్నడిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 5 వరకు సాహో స్పెషల్ షోలని ప్రదర్శించాలనుకుంటున్నామని ఈ ఈనేపథ్యంలో రాత్రి 1:00 గంటల నుంచి ఉదయం 10:00 గంటల మధ్యలో రెండు ప్రత్యేక షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వాలని సాహో నిర్మాతలు కోరారు. సినిమాకు ఉన్నా క్రేజ్ ను చూసి సాహో ప్రత్యేక షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. 

ఈ క్రమంలో సాహో చిత్రాన్ని తొలి వారం రోజుకు 6 షోలు ప్రదర్శించనున్నారు. ఏపీ ప్రభుత్వం ఆరు ఆటలు ప్రదర్శించేందుకు అనుమతి ఇస్తూ ఒక జివోని కూడా రిలీజ్ చేసింది. పైగా టికెట్ రేట్లను పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. పైగా పెంచే టికెట్ రేట్లు ప్రధాన సెంటర్లలో రెండు వారాల పాటు, మిగతా సెంటర్లలో వారం పాటు అమలులో ఉండచ్చని జీవోలో పేర్కొన్నట్టు సమాచారం. అయితే ఇక సాహో ఏపీ ప్రభుత్వానికి రాసినట్టే అదనపు షోలు, టిక్కెట్ ధర పెంచుకునే కోసం తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఒక లేఖ రాసింది. అయితే దీని పై తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇక్కడ నిర్ణయం ఎలా ఉన్నా సరే సినిమా రిలీజ్ కాక తప్పదు అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా అన్ని భాషల్లో పెద్ద ఎత్తున చేస్తున్నారు. ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తున్న ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్, అరుణ్ విజయ్, మందిరా బేడీ, మురళి శర్మ, వెన్నెల కిషోర్ ఇతర కీలకపాత్రలు చేస్తున్నారు. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఈ సినిమాను మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో రిలీజ్ చేస్తున్నారు.

More Related Stories