English   

శేఖర్ కమ్ములకు కోపం వచ్చింది.. నల్లమల్ల తవ్వకాలపై సీరియస్.. 

 Shekhar Kammula
2019-08-28 12:45:20

ఎప్పుడూ శాంతంగా ఉండే దర్శకుడు శేఖర్ కమ్ముల ఒక్కసారిగా మండిపడ్డారు. ఆయనకు కూడా కోపం వస్తుందని ఇప్పుడే తెలిసింది. ఈయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మౌనంగానే తన నిరసనను తెలియజేసాడు. నల్లమలలో యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే వార్తలు వినిపించడంతో ఆదివాసులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఇలా చేస్తే అడవి నాశనం అవుతుందని.. అక్కడున్న జంతువులు కూడా చచ్చిపోతాయంటున్నారు వాళ్లు. వీళ్ళతో ఇప్పుడు శేఖర్ కమ్ముల కూడా గళం కలిపాడు. దీనిపై శేఖర్ కమ్ముల స్పందిస్తూ.. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టబోతున్నారు. వీటి వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం. చెంచులు, ఇతర అటవీ వాసులు నివసిస్తున్న ప్రాంతం, అంతరించిపోతున్న పులులు నివసించే ప్రాంతం అయిన నల్లమల సమూలంగా నాశనం అవుతుంది. కృష్ణా నది, దాని ఉపనదులు కలుషితం అవుతాయి. ఇప్పటికే చాలా మంది కేన్సర్ బారిన పడ్డారు. యురేనియం తవ్వకాల వల్ల కేన్సర్ రోగుల సంఖ్య మరింత పెరుగుతుంది. యురేనియం కోసం పర్యావరణాన్ని నాశనం చేసుకోకూడదు. వెంటనే ప్రభుత్వం స్పందించి చెంచులను, ఇతర ఆదివాసులను, పర్యావరణాన్ని.. మెుత్తంగా నల్లమల అడవుల్ని కాపాడాలి అంటూ ట్వీట్ చేసాడు. కనీసం ఇప్పటికైనా అడవులను కాపాడుకుందాం.. అరుదైన పులులను కూడా బతికించుకుందాం అంటూ ట్వీట్ చేసాడు శేఖర్ కమ్ముల. ఈయనకు ఇప్పుడు చాలా మంది అండగా నిలుస్తున్నారు. సేవ్ నల్లమల అంటూ గళం విప్పుతున్నారు.

More Related Stories