English   

డిస్కో రాజా వచ్చేదెప్పుడంటే.. రిలీజ్ డేట్ కన్ఫర్మేషన్.. 

Disco Raja
2019-08-28 14:44:09

వరుస పరాజయాలతో ఉన్న రవితేజ డిస్కో రాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి సినిమాలు తెరకెక్కించిన వీఐ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కాస్త ప్రయోగాత్మక కథను వినోదాత్మకంగా చెప్పే ప్రతయ్నం చేస్తున్నాడు ఈయన. రవితేజ ఇమేజ్ కి తగ్గట్లు బ్యాలెన్స్ చేస్తూ డిస్కో రాజా సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఆనంద్. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ 50 శాతం పూర్తయింది. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.. తండ్రి కొడుకులు గా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తున్నాడు మాస్ రాజా. ఆర్ఎక్స్ 100 సినిమాలో ముద్దులతో రెచ్చిపోయిన పాయల్ రాజ్ పుత్.. తాన్యా హోప్.. ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ న‌భా న‌టేష్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో కచ్చితంగా ఫామ్ లోకి వ‌స్తానంటూ ధీమాగా చెబుతున్నారు మాస్ రాజా. చూస్తుంటే ఆయన నమ్మకం కూడా నిలబడేలాగే కనిపిస్తుంది. కచ్చితంగా ఈ సినిమాతో రవితేజ హిట్ కొడతాడని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. రామ్ తల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి మాయ చేయబోతున్నాడు అనేది చూడాలి.

More Related Stories