తమిళ్ హిట్ సినిమా రీమేక్...మాస్ మహారాజా ఓకే చెప్పాడా ?

ప్రస్తుతం రీమేక్‌ల సీజన్ నడుస్తోంది. తమిళం హిట్ అయిన సినిమాలను తెలుగులోకి అనువదించి, తెలుగులో హిట్ అయిన సినిమాల నుండి తమిళంలోకి రీమేక్ లు అవుతున్నాయి. ఇప్పుడు జిగార్తండా సినిమాని తెలుగులోకి రీమేక్ చేస్తుండగా తా జాగా తమిళంలో మంచి హిట్టుకొట్టిన 'విక్రమ్‌వేద'ను సైతం రీమేక్‌గా తెలుగుకి రీమేక్ చేయనున్నట్టు చెబుతున్నారు. తమిళంలో పుష్కర్, గాయత్రి సంయుక్త దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ వేద ఘన విజయం సాధించింది. నటుడు మాధవన్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విక్రమ్ పాత్ర పోషిస్తే, గ్యాంగ్‌స్టర్ వేదగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించాడు. ఇక ఈ సినిమా తెలుగులో రీమేక్ చేయనున్నారని చెబుతున్నారు. గతంలో ఈ సినిమా గురించి ఇదే రకమైన ప్రచారం జరిగింది. అయితే అప్పుడు ఈ సినిమా చేయడం లేదని ప్రకటనలు వచ్చినా ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా పట్టాలు ఎక్కనున్నట్టు ప్రచారం మొదలయింది.
ఇక ఈ సినిమా రీమేక్ లో మాధవన్ పాత్ర రవితేజ పోషించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక గ్యాంగ్‌స్టర్ వేద పాత్రలో సేతుపతినే తీసుకోవచ్చని అంటున్నారు. అది పూర్తయ్యేసరికి ఈ ప్రాజెక్టుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం లేకపోలేదు. ఈమధ్యే శర్వానంద్ హీరోగా గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో 'రణరంగం' సినిమా చేసిన సుధీర్ వర్మ ఈ సినిమా రీమేక్ బాధ్యతలు చేపట్టాడని అంటున్నారు. ఈ తమిళ సినిమాని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తున్నట్టు చెబుతున్నారు. తమిళంలో వై నాట్ స్టూడియోస్ ఎస్. శశికాంత్ నిర్మించిన ఈ సినిమాని ఆయనే తెలుగులో కూడా నిర్మిస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం 'డిస్కో రాజా' సినిమాతో బిజీగా ఉన్నారు రవితేజ.ఆ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాక ఈ సినిమా పూర్తి అయ్యాక ఈ సినిమా మీద ద్రుష్టి పెట్టచ్చని చెబుతున్నారు.