శర్వానంద్ కొత్త సినిమా...రీతూ వర్మతో

హీరో శర్వానంద్ మంచి జోరు మీదున్నాడు. ఈ మధ్యనే 96 సినిమా షూటింగ్ లో ప్రమాడానికి గురయి గాయపడ్డ శర్వా త్వరగానే కోలుకొని వరుస ప్రాజెక్టులని లైన్లో పెడుతున్నాడు. శర్వా మొన్ననే రణరంగం అనే సినిమా రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఆయన 96 అనే తమిళ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు తన 29వ సినిమా శ్రీకరం పేరుతో కిశోర్ రెడ్డి అనే దర్శకుడి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ మధ్యనే లాంచ్ అయిన ఈ సినిమాని రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2020 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలు లైన్ లో ఉండగానే మరో సినిమా ఈరోజు లాంచ్ చేసేశాడు. సౌత్ ఇండియాలో పెద్ద ప్రొడక్షన్ సంస్థ అయిన డ్రీమ్ వారియర్పిక్ తాజాగా కొత్త చిత్రం లాంచ్ చేసింది. శర్వానంద్ హీరోగా, రీతూ వర్మ హీరోయిన్ గా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌లో వెన్నెల కిషోర్, ప్రియదర్శి ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాని శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నాడు. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి జేక్స్ బెజాయ్ సంగీతం అందిస్తున్నారు. చెన్నైలోనే ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరగనుందని అంటున్నారు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాని తమిళ, తెలుగు బాషలలో రిలీజ్ చేసే అవకాశాలను కూడా చూస్తున్నట్టు చెబుతున్నారు.