English   

సాహో ప్రివ్యూ.. హిట్ కొట్టాలంటే ఎన్ని వందల కోట్లు రావాలంటే.. 

 Saaho Preview
2019-08-28 18:32:42

సాహో ఇప్పుడు ఇండియన్ సినిమా అయిపోయింది. ఈ చిత్రం తెలుగు సినిమా రేంజ్ దాటిపోయి చాలాకాలం అయిపోయింది. హిందీ ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని తమ సినిమాలాగే ట్రీట్ చేస్తున్నారు. సాహో బిజినెస్ కూడా అలాగే జరిగింది. ఇది చూసిన తర్వాత అందరికీ కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో విడుదలకు ముందు దాదాపు 330 కోట్ల బిజినెస్ చేసింది. ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజీత్ ఈ చిత్రాన్ని ఒక సంచలనంగా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ తో పాటు గన్ ఫైట్ సీన్.. జెట్ బ్యాక్ సీన్ హైలైట్ కానున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ ఇంట్రో సీన్ కోసం భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇక టీజర్ లో చూపించినట్లుగా వెనక జెట్ తగిలించుకుని గాల్లో తేలిపోయే సీన్స్ కూడా అదిరిపోయాయని తెలుస్తుంది. 

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సంచలనాలు రేపుతుంది. హిందీలో కూడా ఈ సినిమాను టీ సిరీస్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు. తెలుగులో కూడా దాదాపు 140 కోట్ల బిజినెస్ వరకు సాహో చేసింది. బాహుబలి తీసుకొచ్చిన న‌మ్మ‌కంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా ప్రభాస్ సినిమాపై ఎంత పెట్టడానికైనా సిద్ధంగానే కనిపిస్తున్నారు. తమిళ, కన్నడ ఇండస్ట్రీల్లో కూడా రికార్డు బిజినెస్ చేస్తుంది సాహో. కేవలం ఇండియాలోనే దాదాపు 300 కోట్ల బిజినెస్ చేస్తుంది సాహో. ఇక ఓవర్సీస్లో 36 కోట్లకు ఈ చిత్రం హక్కుల్ని ఫర్స్ ఫిలిమ్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

అక్కడ బాహుబలి సృష్టించిన సంచలనం వాళ్లు చూశారు కాబ‌ట్టి ప్రభాస్ మార్కెట్ భారీగా ఉందని న‌మ్మి ఇంత రేట్ పెట్టారు.  ప్రస్తుతం సినిమాపై ఉన్న అంచనాలతో పోలిస్తే 36 కోట్లు చిన్నగానే కనిపిస్తుంది. దానికి తోడు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ అన్ని భాషలకు కలిపి 36 కోట్లు చెల్లించారు. దాంతో ఓవర్సీస్ లో సాహో సినిమా సేఫ్ కావాలంటే దాదాపు 10 మిలియన్ డాలర్స్ వసూలు చేయాలి. అది చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. ఆగస్టు 30న సాహో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కచ్చితంగా ఈ బిజినెస్ ఇప్పుడు బాలీవుడ్ హీరోలకు కూడా నిద్ర లేకుండా చేస్తుంది. మరి చూడాలిక.. సాహో ప్రభంజనాలు ఎలా ఉండబోతున్నాయో..? 

More Related Stories