English   

సాహో యూనిట్ కి షాక్ తప్పదా ?

saaho
2019-08-28 19:06:23

ప్రభాస్ నటించిన సాహో సినిమా కోసం కేవలం ఆయన అభిమానులే కాక సినీ అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరో రెండ్రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా బడ్జెట్ రీత్యా టిక్కెట్లు పెంచి అమ్ముకునేలా పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వాన్ని ఈ సినిమా టీమ్ కోరగా అందుకు ఏపీ ప్రభుత్వం ఒకే చెప్పింది. ఇప్పుడు ఈ నిర్ణయం మీద సినిమా యూనిట్ కి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఈ సినిమా కోసం టిక్కెట్ లు పెంచి అమ్మడం సరికాదని పేర్కొంటూ దర్శకనిర్మాత నట్టికుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో టికెట్ రేటు పెంపు పై వివరణ ఇవ్వాలని హైకోర్టు నిర్మాతలను ఆదేశించింది. ఈ మేరకు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నోటీసులు జారీచేసింది. అయితే ఏపీ ప్రభుత్వం ఇచ్చినట్టు తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేటు పెంపుకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో తెలంగాణలో మాములు రేట్లకే సాహో టికెట్లు అమ్మనున్నారు. అయితే సినిమాకి ఇంకా గంటల సమయం మాత్రమె ఉండడంతో రేటు పెంచి టికెట్ అమ్మడం కుడురకపోవచ్చని అంటున్నారు. దీని మీద మంరింత సమాచారం అందాల్సి ఉంది.

More Related Stories