English   

కాజల్ మళ్లీ బాలీవుడ్ అంటుందిగా.. స్టార్ హీరోతో రొమాన్స్..

kajal
2019-08-28 19:15:47

కాజ‌ల్ అగర్వాల్.. ఈ భామ‌కు ద‌క్షిణాదిన కావాల్సినంత ఇమేజ్ ఉంది. ఇప్ప‌టికీ సినిమాకు ఎంత కావాలంటే అంత డిమాండ్ చేస్తుంది ఈ బ్యూటీ. ఇక్క‌డ నెత్తిన పెట్టుకుని చూసుకునే నిర్మాతలను వదిలేసి అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు బాలీవుడ్ వెళ్లింది కాజల్. అక్కడ రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత కానీ అమ్మాయిగారికి బల్బ్ వెలగలేదు. అందుకే మనకు ఇక్కడే కరెక్ట్.. అక్కడ కాదంటూ మళ్ళీ బ్యాగ్ సర్దుకుని సౌత్ వచ్చేసింది. ఎందుకో తెలియదు కానీ అక్క‌డ అక్ష‌య్ కుమార్, అజయ్ దేవ్ గ‌న్ లాంటి హీరోల స‌ర‌స‌న నటించి హిట్లు వచ్చిన తర్వాత కూడా కాజల్ ను ఎవరూ పట్టించుకోలేదు. దో ల‌ఫ్జోంకీ క‌హాని డిజాస్ట‌ర్ గా నిలవ‌డంతో ఈ భామ వైపు చూడ‌ట‌మే మానేసారు అక్క‌డి దర్శక నిర్మాత‌లు. కానీ కాజ‌ల్ మాత్రం తనకు కథలు నచ్చక బాలీవుడ్ వైపు వెళ్లడం లేదని చెబుతుంది. ఇక ఇప్పుడు మరో ఆఫర్ ఈ భామ ముందుకు వచ్చి నిలిచింది. జాన్ అబ్రహాం హీరోగా సంజయ్ గుప్తా తెరకెక్కించబోయే ముంబై మాఫియా డ్రామా ముంబై సాగాలో హీరోయిన్ గా కాజల్ నటించబోతుంది. ఇందులో జాకీ ష్రాఫ్, సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటించబోతున్నారు. త్వరలోనే సినిమా మొదలు కానుంది. దక్షిణాదిన కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఇండియన్ 2లో నటిస్తుంది ఈ భామ. అటు ఇటు అవకాశాల వేటలో దూసుకుపోతూ రెండు ఇండస్ట్రీలను సరిగ్గా బ్యాలెన్స్ చేస్తుంది కాజల్.

More Related Stories