English   

మీకు మాత్రమే చెప్తానంటున్న విజయ్ దేవరకొండ..

vijay
2019-08-28 20:14:43

హీరోగా సంచలన విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్న సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈయనకు క్షణం తీరిక లేనంతగా వరస సినిమాలు ఉన్నాయి.. అయినా కూడా ఇప్పుడు మరో బాధ్యత తీసుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. కింగ్ ఆఫ్ హిల్స్ అనే పేరుతో ఇప్పటికే నిర్మాణ సంస్థ మొదలుపెట్టాడు విజయ్. ఇందులో మొదటి సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు ఈ కుర్ర హీరో. ఈ సినిమాలో నటించటం లేదు కానీ మంచి నటులను తీసుకుంటున్నాడు. విజయ్ దేవరకొండ తొలి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్నాడు. ఇదే విషయంపై ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. సినిమాకు టైటిల్ కూడా విచిత్రంగా పెట్టాడు విజయ్. మీకు మాత్రమే చెప్తా అంటూ ఓ ప్రమోషనల్ వీడియో విడుదల చేసాడు విజయ్ దేవరకొండ. ఇందులో యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటించనుంది. ప్రస్తుతం ఈమె నటిగా చాలా బిజీగా ఉంది. ఓ వైపు యాంకర్ గా సత్తా చూపిస్తూనే మరోవైపు వెండితెరపై కూడా దుమ్ము దులిపేసింది అనసూయ. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ నిర్మాణం లో నటించబోతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు బయటకు రానున్నాయి. ప్రస్తుతానికి దర్శకుడు ఎవరు అనేది తెలియకపోయినా కూడా కథ స్క్రీన్ ప్లే మాత్రం సిద్ధంగా ఉన్నాయంటున్నాడు విజయ్ దేవరకొండ. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత తన ప్రొడక్షన్ లో తొలి సినిమా గురించి అభిమానులతో పంచుకున్నారు ఈ కుర్ర హీరో. మొత్తానికి ఏదేమైనా కూడా హీరోగా బిజీగా ఉంటూనే నిర్మాతగానూ చిన్న సినిమాలకు సాయం అందిస్తున్నాడు విజయ్ దేవరకొండ.

More Related Stories