English   

తెరమీదకు వాజ్ పేయి జీవితం...త్వరలోనే !

biopic
2019-08-28 20:27:59

ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తుంది. ప్రతి ఒక్కరు సక్సెస్ ఫుల్ గా నిలిచిన వారి బయోపిక్ తియ్యాలని దాన్ని క్యాష్ చేసుకోవాలని తహతహలాడిపోతున్నారు. ఒక్క ఇండస్ట్రీకే పరిమితం కాకుండా టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా ఇప్పుడు బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. వాస్తవ జీవిత సంఘటనలతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాలు భారీ విజయాలు సాధించడంతో పాటు భారీగానే కలెక్షన్స్ లు కూడా సాధించి పెడుతున్నాయి. ఇదే క్రమంలో బీజేపీ అగ్ర నేత, భారత దేశానికి ప్రధానిగా సేవలందించిన అటల్‌ బిహారీ వాజ్‌పేయి జీవిత చరిత్రను కూడా సినిమాగా తీయనున్నారని చెబుతున్నారు. గతేడాది ఆగస్టు 16న ఆయన కన్నుమూశారు. ఆయన మృతి చెందినప్పుడే ఆయన మీద సినిమా చేస్తామని కొందరు ప్రకటించారు.
ఇక తాజాగా బాలీవుడ్‌లో ఆయన జీవితంపై సినిమా తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే వాజ్‌పేయి జీవితం మీద ఉల్లేఖ్ అనే రచయిత రాసిన 'ది అన్‌టోల్డ్‌ వాజ్‌పేయి' అనే పుస్తకం మీద పూర్తి ఫిలిం మేకింగ్ హక్కులను అమాష్‌ ఫిల్మ్స్‌ అనే సంస్థ దక్కించుకుకుందని అంటున్నారు. ఈ పుస్తకం ఆధారంగా వాజ్ పేయి బయోపిక్ తెరకెక్కించబోతున్నట్లు ఆ సంస్థకి చెందిన నిర్మాతలు శివ శర్మ, జీషాన్ ప్రకటించారు. వాజ్ పేయి బాల్యం నుంచి విద్యాబ్యాసం, రాజకీయ నాయకుడిగా, ప్రధానిగా ఎదిగిన వైనం, ఆయన సాధించిన విజయాలు ఇలా అన్ని అంశాలని సినిమాలో చూపిస్తామని అంటున్నారు. ఈ బయోపిక్ పూర్తి స్క్రిప్ట్ సిద్ధం కాగానే దర్శకుడు, నటీ నటుల్ని ప్రకటిస్తామని వారు చెబుతున్నారు.

More Related Stories