English   

సాహో బ్యానర్ కడుతూ ప్రభాస్ ఫ్యాన్ మృతి.. షాక్ లో యూనిట్.. 

 Prabhas
2019-08-29 08:15:45

అభిమానం అనేది ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది. ఒక్కసారి హీరోపై అభిమానం పెంచుకున్నారంటే అది అంత ఈజీగా పోదు. ఈ డిజిటల్ యుగంలో కూడా ఇంకా బ్యానర్స్, కటౌట్స్ కడుతున్నారంటే అది వాళ్ల అభిమానమే. అయితే ఒక్కోసారి మితిమీరిన అభిమానం ప్రాణాల మీదకు కూడా తెస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. సాహో గురించే ఇప్పుడు ఇండియన్ సినిమా మాట్లాడుకుంటుంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు కూడా వేచి చూస్తున్నారు. బాహుబలి 2 తర్వాత ఈయన రెండేళ్ళైంది కనిపించి. అందుకే ఈ చిత్రం కోసం కళ్ళలో ఒత్తులేసుకుని మరీ వేచి చూస్తున్నారు వాళ్లు. ఆగస్ట్ 30న 10 వేల స్క్రీన్స్ లో సాహో విడుదలవుతుంది. దాంతో థియేటర్స్ దగ్గర ఆ సందడి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే మహబూబ్‌నగర్ తిరుమల థియేటర్ ఆవరణలో ప్రభాస్ సాహో బ్యానర్ కడుతూ ఓ అభిమాని దురదృష్టవశాత్తూ కరెంట్ షాక్ కొట్టి కన్నుమూసాడు. బ్యానర్ కడుతున్న సమయంలో షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. దాంతో ఒక్కసారిగా అంతా షాక్ అయిపోయారు. ఊహించని ఈ ఘటనతో థియేటర్ యాజమాన్యం కూడా షాక్ లోకి వెళ్లిపోయింది. మరి ఈ అభిమాని కుటుంబాన్ని సాహో టీం ఏమైనా ఆదుకుంటుందేమో చూడాలి.

More Related Stories