English   

ప్రభాస్ సాహో సినిమా చూసేది అక్కడేనట ?

Saaho
2019-08-29 09:16:16

భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్యన రేపు విడుదలకబోతున్న సాహో సినిమా క్రేజ్ మాములుగా లేదు. చిన్న డైరెక్టర్ అయినా ప్రభాస్ క్రీజ్ దృష్ట్యా ఈ సినిమాని నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ‘బాహుబలి’ మూవీ తర్వాత ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన ప్రభాస్‌కి మార్కెట్ భారీగా పెరిగింది. ఆయన సినిమాలు వస్తున్నాయంటే వందల కోట్ల వ్యాపారాన్ని ఆశిస్తున్నారు ట్రేడ్ వర్గాల వారు. అందుకు అనుగుణంగానే భారీ బడ్జెట్‌తో ప్రభాస్ ఈ సినిమాని రూపొందించారు. పాత రికార్డుల్ని చెరిపేసి కొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు ‘సాహో’ వేట మొదలుపెట్టేసినట్టే. ఇక సినిమా ట్రైలర్ చూసిన తరవాత అంచనాలు బాగా పెరిగిపోయాయి. సాహో సినిమా మొత్తం బాలీవుడ్ నటులు ఉండడం, అలాగే వరల్డ్ వైడ్ గా సాహో మీద బీభత్సమైన క్రేజ్ ఉండడంతో ఈ సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది. 

ఇక ఈ సినిమా మీద ఇంత క్రేజ్ ఉంటే సాహో సినిమాకి అంతే క్రేజ్ తెచ్చిన ప్రభాస్ ఈ సినిమా ఎక్కడ చూస్తున్నాడు అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే అన్ని బాషలలో బాలీవుడ్ ఎక్కువ మార్కెట్ చేసిన కారణంగా ముంబైలో ప్రీమియర్ లు వేసి అక్కడ సెలెబ్రిటీలతో చూస్తాడని భావించారు. కానీ ప్రభాస్ అక్కడ చూడడం లేదని అంటున్నారు. ప్రభాస్ సహా యూనిట్ అంతా ఈ సినిమాని దుబాయిలో చూడనున్నారని అంటున్నారు. అయితే ప్రభాస్ స్నేహితులు నిర్మాతలు అయిన వంశీ ప్రమోద్ లు సూళ్ళూరుపేటలో కొత్త మల్టీ ప్లేక్స్ ఓపెనింగ్ సందర్భంగా వారు అక్కడే చూడనున్నారని అంటున్నారు. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ లు ఎవరు అనేది తేలకున్నా ఓపెనింగ్ మాత్రం గ్రాండ్ గా ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. 

More Related Stories